Hyderabad: ‘ఫార్ములా-ఈ’ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్.. ఎప్పుడంటే?
గతంలో అంటే, 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫార్ములా వన్ (F-1) రేసును నిర్వహించారు. ఆ తర్వాత భారతదేశంలో నిర్వహించనున్న రెండవ అతిపెద్ద ప్రపంచ క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం.
హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ క్రీడకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. FIA ఫార్ములా Eని ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు FIA వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ క్యాలెండర్‌లో హైదరాబాద్ ఈవెంట్‌కు ఆమెదముద్ర పడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మోటార్ స్పోర్ట్స్.. ప్రారంభం నుంచి జీరో కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో సర్టిఫికేట్ పొందిన మొదటి గ్లోబల్ స్పోర్ట్‌గా అందరి మన్నలను అందుకుంటోంది. ఫార్ములా E ఛాంపియన్‌షిప్ తొమ్మిదో సీజన్ (2022-23)ను ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. అలాగే మెక్సికో తర్వాత ఫోర్త్ రేస్ పోటీలను భాగ్యనగరంలో, డబుల్ హెడర్‌లను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నారు.
గతంలో అంటే, 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫార్ములా వన్ (F-1) రేసును నిర్వహించారు. ఆ తర్వాత భారతదేశంలో నిర్వహించనున్న రెండవ అతిపెద్ద ప్రపంచ క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం. భారతదేశంలో FIA కోసం ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గమనార్హం. నగరంలో రేస్‌ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా ఈ అధికారులు ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ)పై సంతకం చేశారు.
ఫార్ములా E అనేది ఎలక్ట్రిక్-పవర్డ్ సింగిల్-సీటర్ ఛాంపియన్‌షిప్. ఇది 2014లో ప్రారంభమైంది. కాగా, ఏడవ సీజన్ (2020-21 సీజన్)లో FIA ద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్ హోదాను పొందింది. మహీంద్రా రేసింగ్ దాని ప్రారంభ సిరీస్ నుంచి ఫార్ములా ఈ లో భాగంగా ఉంది. ప్రారంభ సంవత్సరంలో కరుణ్ చందోక్ మాత్రమే పోటీలో పాల్గొన్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు.
Formula E racing comes to India Feb 11, 2023 #Hyderabad
The only city in India to be picked up
Thanks to the efforts of min @KTRTRS
We are charged and we will make it the best in the league pic.twitter.com/cCErpmiYTF
— Arvind Kumar (@arvindkumar_ias) June 29, 2022
కాగా, E-Prix అని పిలిడే ఫార్ములా ఈ రేసులకు, ఇప్పటికే ఉన్న వీధులు లేదా స్ట్రీట్ సర్క్యూట్‌లలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎటువంటి ట్రాక్‌లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన స్ట్రీట్ కార్ రేస్ ఎనిమిది మలుపులతో మొత్తం 2.37 కి.మీ పొడవైన రహదారిపై ట్యాంక్ బండ్ సమీపంలో జరుగుతుంది. ప్రస్తుతం, ఫార్ములా ఈ 500 మిలియన్ల వ్యూవర్‌షిప్‌ను కలిగి ఉంది.
ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పంచుకుంటూ ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’కి స్వాగతించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ, లీగ్‌ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.