Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PVL 2025: పీవీఎల్‌ 4వ సీజన్ వేలంలో కాసుల వర్షం.. అత్యధిక ప్రైజ్ పొందిన ఆటగాడు ఎవరో తెలుసా?

Prime Volleyball Auction: కాలికట్‌ వేదికగా ఆదివారం జరిగిన ప్రైమ్ వాలీబాల్ (పీవీఎల్‌) నాలుగో సీజన్ వేలంలో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు ప్లాటినం కేటగిరీ నుంచి శిఖర్ సింగ్‌ను రూ.16 లక్షలకు దక్కించుకుంది. అలాగే, అమన్ కుమార్, దీపు వేణుగోపాల్‌ను వరుసగా రూ.11.5 లక్షలు, రూ.5.75 లక్షలకు కొనుగోలు చేసింది.

PVL 2025: పీవీఎల్‌ 4వ సీజన్ వేలంలో కాసుల వర్షం.. అత్యధిక ప్రైజ్ పొందిన ఆటగాడు ఎవరో తెలుసా?
Pvl Season 4 Auction
Follow us
Venkata Chari

|

Updated on: Jun 08, 2025 | 8:54 PM

కాలికట్, జూన్ 8, 2025: కాలికట్‌ వేదికగా ఆదివారం జరిగిన ప్రైమ్ వాలీబాల్ (పీవీఎల్‌) నాలుగో సీజన్ వేలంలో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు ప్లాటినం కేటగిరీ నుంచి శిఖర్ సింగ్‌ను రూ.16 లక్షలకు దక్కించుకుంది. అలాగే, అమన్ కుమార్, దీపు వేణుగోపాల్‌ను వరుసగా రూ.11.5 లక్షలు, రూ.5.75 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో జెరోమ్ వినీత్ సి అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై బ్లిట్జ్ అతడిని ప్లాటినం కేటగిరీలో రూ. 22.5 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో లీగ్‌లో తను అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. కాలికట్ హీరోస్ స్థానిక ఆటగాడు షమీముద్దీన్‌ను రూ.22.5 లక్షలకు దక్కించుకుంది. కొచ్చి బ్లూ స్పైకర్స్ వినీత్ కుమార్‌ను అదే మొత్తానికి కొనుగోలు చేసింది.

ఆలస్యంగా వేలంలోకి వచ్చిన బెంగళూరు టార్పెడోస్ గోల్డ్ కేటగిరీ నుంచి జిష్ణు పీవీని రూ.14 లక్షల భారీ మొత్తానికి దక్కించుకుంది. అలాగే, జోయెల్ బెంజమిన్. జె ని రూ.6.5 లక్షలకు కొనుగోలు చేసింది. ఇబిన్ జోస్, రోహిత్ కుమార్ చెరో రూ.5 లక్షలతో అదే జట్టులో చేరారు.

చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెడోస్, కోల్‌కతా థండర్ బోల్ట్స్ మధ్య జరిగిన బిడ్డింగ్ వార్‌‌ తర్వాత గతంలో కాలికట్ హీరోస్ తరపున ఆడిన వినీత్‌ను చెన్నై రూ.22.5 లక్షలకు కొనుగోలు చేసింది. ప్లాటినం కేటగిరీ నుంచి చెన్నై ఎం. అశ్విన్ రాజ్ , సమీర్ చౌదరి (రైట్ టు మ్యాచ్) ఒక్కొక్కరిని రూ.8 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది.

షమీముద్దీన్‌తో పాటు, కాలికట్ హీరోస్ అనుభవజ్ఞుడైన సెట్టర్ మోహన్ ఉక్రపాండియన్ (రైట్ టు మ్యాచ్), సంతోష్ ఎస్‌‌లను వరుసగా రూ.8 లక్షలకు దక్కించుకుంది.

అమల్ కె థామస్ రూ.6.5 లక్షలకు కొచ్చి బ్లూ స్పైకర్స్‌ జట్టులో చేరగా, జస్‌జోధ్ సింగ్‌ను గోల్డ్ కేటగిరీ నుంచి రూ.14.75 లక్షలు పలికాడు. అహ్మదాబాద్ డిఫెండర్స్ షాన్ టి జాన్‌ను (రైట్ టు మ్యాచ్) అట్టిపెట్టుకోవడానికి రూ.11.5 లక్షలు వెచ్చించగా, అంగముత్తు, అఖిన్ జీఎస్‌ వరుసగా రూ.11 లక్షలు , రూ.10.5 లక్షలకు అదే జట్టులో చేరారు.

ఢిల్లీ తూఫాన్స్ జట్టు ప్లాటినం కేటగిరీలో రూ.9 లక్షలకు ఆయుష్‌ను దక్కించుకుంది. గోల్డ్ కేటగిరీలో జార్జ్ ఆంటోనీ రూ.5 లక్షలకు ఢిల్లీ జట్టులో చేరగా, మన్నత్ చౌదరి రూ.6.5 లక్షలకు ఆ టీమ్ సొంతమయ్యాడు.

కార్తీక్.ఎ, ల్యాడ్ ఓం వసంత్‌ను ముంబై మెటియోర్స్ టీమ్‌ ప్లాటినం కేటగిరీలో చెరో రూ.8 లక్షలకు దక్కించుకోగా, గోల్డ్ కేటగిరీలో ముంబై విపుల్ కుమార్‌ను (రైట్ టు మ్యాచ్) రూ.6.25 లక్షలకు.. సోను, నిఖిల్‌ను ఒక్కొక్కరిని రూ.5 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రిన్స్, రామానథన్ ప్లాటినం కేటగిరీ నుంచి రూ.8 లక్షలకు గోవా గార్డియన్స్ జట్టులో చేరారు. అమిత్ చ్లోకర్ (రూ.5 లక్షలు) కూడా ఆ జట్టు సొంతమయ్యాడు.

పంకజ్ శర్మను కోల్‌కతా థండర్ బోల్ట్స్ గోల్డ్ కేటగిరీలో రూ.6 లక్షలకు కొనుగోలు చేసింది. సృజన్ శెట్టి రూ.5 లక్షలకు కోల్‌కతా టీమ్‌లోచేరాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత