AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2022: ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ అవసరం లేదంటూ ఆదేశాలు..

FIFA పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నవంబర్ 20 నుంచి ఖతార్‌లో ప్రారంభమవుతుంది. 29 రోజుల టోర్నమెంట్‌లో మొత్తం 32 జట్లు పాల్గొంటాయి.

FIFA World Cup 2022: ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ అవసరం లేదంటూ ఆదేశాలు..
Fifa World Cup
Venkata Chari
|

Updated on: Sep 30, 2022 | 7:50 AM

Share

ఈ సంవత్సరం క్రీడా ప్రపంచంలో రెండు అతిపెద్ద ఈవెంట్‌లు వరుసగా రెండు నెలల్లో జరగబోతున్నాయి. అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ నిర్వహించనుండగా, కొన్ని రోజుల తర్వాత అతిపెద్ద ‘సింగిల్ స్పోర్ట్ ఈవెంట్’ ప్రారంభమవుతుంది. అదే ఫుట్‌బాల్ ప్రపంచ కప్. FIFA పురుషుల ప్రపంచ కప్ 2022 ఈ సంవత్సరం నవంబర్-డిసెంబర్‌లో అరబ్ దేశమైన ఖతార్‌లో జరుగుతుంది. దీని కోసం అభిమానులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎందుకంటే ప్రపంచ కప్ కోసం ఖతార్‌కు రావడానికి వ్యాక్సిన్ తప్పనిసరి కాదంటూ ఆదేశాలు జారీ చేసింది.

వ్యాక్సిన్ లేదు, నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి..

ఇవి కూడా చదవండి

ప్రపంచ కప్ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఖతార్ ప్రభుత్వం సెప్టెంబర్ 29 గురువారం ప్రకటించింది. అయితే, అభిమానులు ఈ అద్భుతమైన టోర్నమెంట్‌ను చూసేందుకు టీకా వేసుకోవాలనే నిబంధనలను పక్కన పెట్టింది. అయితే, దేశంలోకి ప్రవేశించే ముందు, వారు తప్పనిసరిగా కరోనా పరీక్ష ప్రతికూల నివేదికను చూపించవలసి ఉంటుంది.

ఖతార్‌లో తొలిసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నారు. 32 జట్లతో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ టోర్నమెంట్ నవంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. 29 రోజుల పాటు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఖతార్ ప్రభుత్వం, ఫిఫా ఈ ఈవెంట్‌ను ప్రపంచ మహమ్మారి ముగింపుగా గుర్తించాలనుకుంటున్నామని, అందువల్ల కరోనా నిబంధనలకు సంబంధించి అభిమానులపై మరింత కఠినమైన ఆంక్షలు విధించవద్దని చెప్పుకొచ్చింది.

ప్రభుత్వ యాప్‌లో గ్రీన్ మార్క్ అవసరం..

అయితే, కొన్ని విషయాలు తప్పక పాటించాలి. దీని కింద, 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అభిమానులు వారి కార్యకలాపాలు, ఆరోగ్య స్థితిని ట్రాక్ చేసే అధికారిక ఫోన్ యాప్ Etherajని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రపంచకప్ నిర్వాహకులు మాట్లాడుతూ, ఇండోర్ పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లాలంటే అథెరాజ్ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి అని సూచించింది.

అయితే, కరోనా పరిస్థితి అదుపు తప్పితే, తమ నిబంధనలను కూడా మార్చుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మాస్క్‌లు ధరించాలని అభిమానులను కూడా ఆదేశించారు. వీక్షకుడికి వ్యాధి సోకితే, అతను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనను తాను ఒంటరిగా ఉంచుకోవలసి ఉంటుంది.

29 రోజులు, 32 జట్లు..

అనేక వివాదాలు ఉన్నప్పటికీ, టోర్నమెంట్ నవంబర్ 20 నుంచి ఖతార్‌లో ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. 29 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో 32 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. సాధారణంగా FIFA ప్రపంచ కప్‌ను ఎల్లప్పుడూ జూన్-జూలై నెలలలో నిర్వహిస్తారు. అయితే ఈ నెలల్లో ఖతార్‌లో వేడి వాతావరణం దృష్ట్యా, నవంబర్-డిసెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.