FIFA World Cup Winner: ఫిఫా విజేతకు దక్కేది డూప్లికేట్ ట్రోఫీనే.. ఒరిజినల్ ఎవరిస్తారో తెలుసా?
Fifa World Cup 2022 Trophy: మరికొద్దిసేపట్లో ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా పోటీపడనున్నాయి. అర్జెంటీనా క్రొయేషియాను ఓడించగా, ఫ్రాన్స్ మొరాకోను ఓడించి టైటిల్ మ్యాచ్‌లో తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి.

Fifa Winner Prize Money: నేడు (డిసెంబర్ 18) ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ దోహాలోని లుసైల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ మూడోసారి టైటిల్ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా కూడా మూడోసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొరాకోపై ఫ్రాన్స్ విజయం సాధించగా, క్రొయేషియాపై అర్జెంటీనా విజయం సాధించి టైటిల్ మ్యాచ్‌లో చోటు దక్కించుకుంది.
గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీ దక్కదు..
ఫైనల్ మ్యాచ్ తర్వాత గెలిచిన జట్టుకు అందజేసే ట్రోఫీ కథనం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నేటి ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీని సంబరాలు చేసుకోవడానికి మాత్రమే అందజేస్తారు. అవార్డు ప్రదానోత్సవం తర్వాత ఫిఫా అధికారులు విజేత జట్టు నుంచి అసలు ట్రోఫీని వెనక్కు తీసుకుంటారు. అంటే ఫ్రాన్స్/అర్జెంటీనా జట్టు ఈ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. బదులుగా, విజేత జట్టుకు డూప్లికేట్ ట్రోఫీ ఇస్తారు. ఈ డూప్లికేట్ ట్రోఫీ (రెప్లికా) కాంస్యంతో తయారు చేశారు. దానిపై బంగారు పూత ఉంటుంది.
FIFA ప్రపంచ కప్ అసలు ట్రోఫీ ఎక్కువగా జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలోనే ఉంటుంది. ఇది ఫిఫా వరల్డ్ కప్ టూర్, ప్రపంచ కప్ మ్యాచ్ సమయంలో మాత్రమే ప్రపంచానికి పరిచయం చేస్తారు. 2005లో, విజేత జట్టు అసలు ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లకూడదని ఫిఫా రూల్ జారీ చేసింది. దీంతో ఒరిజినల్ ట్రోఫీ లేకుండా విజేత జట్టు ఇంటికి వెళ్తుంది.




గతంలో జూల్స్ రిమెట్ ట్రోఫీని అందించారు..
తొలిసారిగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 1930లో ప్రారంభమైంది. ఆ సమయంలో విజేత జట్టుకు ఇచ్చే ట్రోఫీకి జూల్స్ రిమెట్ ట్రోఫీ అని పేరు పెట్టారు. జూల్స్ రిమెట్ ట్రోఫీని 1970 వరకు ఛాంపియన్ జట్లకు అందించారు. ఆ తర్వాత ప్రపంచ కప్ ట్రోఫీని మళ్లీ డిజైన్ చేశారు. కొత్త ట్రోఫీని రూపొందించే బాధ్యతను ఇటాలియన్ కళాకారుడు సిల్వియో గజానియాకు అప్పగించారు. ఈ ట్రోఫీ 1974 సీజన్ నుంచి అందుస్తున్నారు. దీనిని ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ అంటారు.
8 క్యారెట్ల బంగారంతో ఫిఫా ట్రోఫీ..
ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ బరువు సుమారు 6.175 కిలోలు ఉంటుంది. దీనిని 18 క్యారెట్ల బంగారంతో (75 శాతం) తయారు చేయడానికి ఉపయోగించారు. ట్రోఫీ పొడవు 36.8 సెం.మీ, దాని ఉపరితల వ్యాసం 13 సెం.మీ. ఉంటుంది. ట్రోఫీ పునాదిపై మలాకైట్ రాయిని రెండు పొరలు అమర్చారు. 1994 సంవత్సరంలో ఈ ట్రోఫీలో స్వల్ప మార్పు చేసిన తర్వాత, విజేత జట్టు పేరును రాసేందుకు దాని దిగువ భాగంలో ఒక ప్లేట్ ఉంచారు. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రూ.347 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.248 కోట్లు అందివ్వనున్నారు.
టాప్-4 జట్ల ప్రైజ్ మనీ:
విజేతకు – రూ. 347 కోట్లు
రన్నరప్‌కు- రూ. 248 కోట్లు
క్రొయేషియా – రూ. 223 కోట్లు
మొరాకో – రూ . 206 కోట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




