ARG vs FRA, FIFA Final Highlights: సాకారమైన మెస్సీకల.. మూడోసారి వరల్డ్ ఛాంపియన్ గా అర్జెంటీనా

| Edited By: Narender Vaitla

Updated on: Dec 18, 2022 | 11:47 PM

Argentina vs France FIFA World Cup 2022 Final Highlights in Telugu: 36 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. మెస్సీ కల సాకారమై అర్జెంటీనా మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి టైటిల్ కరువును తీర్చుకుంది.

ARG vs FRA, FIFA Final Highlights:  సాకారమైన మెస్సీకల.. మూడోసారి వరల్డ్ ఛాంపియన్ గా అర్జెంటీనా
Fifa 2022 Final Live Score, Argentina Vs France

FIFA World Cup 2022 Highlights:  ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా మరోసారి మెరిసింది. ఆదివారం రాత్రి ఫ్రాన్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో విజయం సాధించి సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్ ను ముద్దాడింది. పెనాల్టీ షూటౌట్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.  ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది ఫైనల్‌ ఫైట్‌. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది. ఏకంగా రెండు గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ గోల్స్ ఏమీ చేయలేకపోయింది. ముఖ్యంగా అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి.. మరోసారి మెస్మరైజ్‌ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టి.. అర్జెంటీనా అభిమానుల్లో జోష్‌ నింపాడు. అదే ఉత్సాహంతో ఆడిన ఆటగాళ్లు ఫ్రాన్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Dec 2022 11:22 PM (IST)

    మొత్తం 5 పెనాల్టీషూట్స్..

    120 నిమిషాల తర్వాత కూడా ప్రపంచకప్‌లో ఛాంపియన్‌ ఎవరన్నది ఖరారు కాకపోవడంతో స్కోరు 3-3తో సమమైంది. 90 నిమిషాల్లో 2-2తో డ్రా అయిన తర్వాత, 30 నిమిషాల అదనపు సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్ సాధించాయి. తొలుత మెస్సీ 109వ నిమిషంలో ఆధిక్యం సాధించగా, 117వ నిమిషంలో ఎంబాప్పే పెనాల్టీతో హ్యాట్రిక్ సాధించడమే కాకుండా జట్టును 3-3తో సమం చేశాడు.

    ఇప్పుడు 5-5 షాట్ల పెనాల్టీ షూటౌట్‌లో నిర్ణయం తీసుకోబడుతుంది.

  • 18 Dec 2022 11:18 PM (IST)

    పెనాల్టీ షూటౌట్‌కు మ్యాచ్‌..

    ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 3-3తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం తేల్చనున్నారు.

  • 18 Dec 2022 11:12 PM (IST)

    ఎంబాపే హ్యాట్రిక్‌ గోల్‌.. మళ్లీ స్కోరు సమం..

    ఎంబాపే హ్యాట్రిక్‌ గోల్‌ కొట్టాడు. 116వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను నేరుగా గోల్‌ పోస్ట్‌ లోకి పంపి ఫైనల్‌ లో వరుసగా మూడో గోల్‌ నమోదు చేశాడు. దీంతో మరోసారి 3-3తో స్కోరు సమమైంది. పీలే తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా ఎంబాప్పే నిలిచాడు.

  • 18 Dec 2022 11:06 PM (IST)

    మరోసారి మెస్సీ మాయ..అర్జెంటీనా మూడో గోల్‌..

    మెస్సీ మరోసారి అద్భుతం చేశాడు. ఫైనల్‌లో తన రెండో గోల్‌ సాధించాడు. మార్టినెజ్ గోల్ దగ్గర నుండి ఒక పదునైన షాట్ కొట్టాడు, దానిని కీపర్ లోరిస్ ఆపాడు, కానీ బంతి అక్కడ బౌన్స్ చేయబడింది. అక్కడే ఉన్న మెస్సీ దానిని త్వరగా గోల్‌లో ఉంచి జట్టుకు కీలక ఆధిక్యాన్ని అందించాడు. దీంతో అర్జెంటీనా ఖాతాలో మూడో గోల్‌ చేరింది.

  • 18 Dec 2022 11:02 PM (IST)

    చివరి 15 నిమిషాలు మాత్రమే.. రిజల్ట్‌ రాకపోతే పెనాల్టీ షూటౌట్‌..

    అదనపు సమయం మొదటి సగం ముగిసింది. ఇరు జట్లు సై అంటే సై అంటున్నాయి . చివరి రెండు నిమిషాల్లో అర్జెంటీనాకు రెండు మంచి అవకాశాలు వచ్చినా మార్టినెజ్ వాటిని గోల్‌గా మలచలేకపోయా

  • 18 Dec 2022 10:55 PM (IST)

    అర్జెంటీనా జట్టులోనూ రెండు మార్పులు..

    అర్జెంటీనా కూడా జట్టులో మార్పులు చేసింది. మొదటి నుంచి ఆడుతున్న స్ట్రైకర్ అల్వారెజ్, మిడ్‌ఫీల్డర్ డిపోల్ ఔట్ అయ్యారు. వారి స్థానంలో స్ట్రైకర్లు లౌటారో మార్టినెజ్, లియాండ్రో పరేడెస్ బరిలోకి దిగారు

  • 18 Dec 2022 10:50 PM (IST)

    ఫ్రాన్స్‌ జట్టులో మార్పు..

    15 నిమిషాల అదనపు సమయంలో ప్రథమార్థం ప్రారంభమైంది. ఆట ప్రారంభమైన 5 నిమిషాల్లోనే ఫ్రాన్స్ మార్పు చేసింది. మిడ్‌ఫీల్డర్ రాబియో స్థానంలో వెస్లీ ఫోఫానాను తీసుకున్నారు.

  • 18 Dec 2022 10:40 PM (IST)

    మరో అర్ధగంట పొడిగింపు..

    ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ ఎలాంటి గోల్స్‌ నమోదు కాలేదు. దీంతో మరోసారి 30 నిమిషాలు అదనపు సమయం ఇచ్చారు. అందులోనూ ఫలితం రాకపోతే అప్పుడు పెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం తేల్చనున్నారు.

  • 18 Dec 2022 10:36 PM (IST)

    సమయం పొడిగింపు..

    నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో ఆటను 8 నిమిషాల పాటు పొడిగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ సమయంలో మెస్సీ మరో అద్భుతమైన షాట్‌ ఆడాడు. అయితే ఫ్రాన్స్ కీపర్ లోరిస్ గాలిలో దూకి ఒక చేత్తో బంతినిఆపాడు.

  • 18 Dec 2022 10:27 PM (IST)

    మెస్సీని అధిగమించిన ఎంబాపే..

    దాదాపు 70-80 నిమిషాల పాటు గోల్‌ చేయకుండా ఆడిన ఫ్రాన్స్‌ కైలియన్ ఎంబాపే చెలరేగడంతో మళ్లీ పోటీలోకి వచ్చింది. చివరి నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ సాధించాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో ఎంబాపే గోల్స్‌ సంఖ్య 7 కు చేరుకుంది. గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ కంటే అతనే ముందున్నాడు.

  • 18 Dec 2022 10:18 PM (IST)

    చివర్లో ఫ్రాన్స్‌ సంచలనం.. వరుసగా రెండు గోల్స్‌ చేసిన ఎంబాపే..

    ఫ్రాన్స్‌ అద్భుతంగా పునరాగనమనం చేసింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎంబాపే వరుసగా రెండు గోల్స్ కొట్టి స్కోరు సమం చేశాడు. ప్రస్తుతం ఇరు జట్లు 2-2 తో సమానంగా ఉన్నాయి. ఆట 80వ నిమిషంలో తొలుత పెనాల్టీని గోల్‌గా మలిచిన ఎంబాపె.. మలి నిమిషం సహచర ఆటగాడు ఇచ్చిన పాస్‌ను చక్కగా వినియోగించుకున్న ఎంబాపె సూపర్‌ గోల్‌తో మెరిశాడు. దీంతో 2-2తో మ్యాచ్‌ సమమైంది.

  • 18 Dec 2022 10:13 PM (IST)

    ఎంబాపే మొదటి షాట్

    71వ నిమిషంలో ఫ్రాన్స్‌ తొలి షాట్‌ను ఎంబాపే ప్రయత్నించాడు. అర్జెంటీనా ఆటగాళ్లను తప్పిస్తూ గోల్‌ పోస్ట్‌ వైపు బంతిని కొట్టాడు. కానీ మెస్సీ సేన డిఫెన్సివ్ లైన్ చాలా బలంగా ఉంది. దీంతో గోల్‌ మిస్‌ అయ్యింది.

  • 18 Dec 2022 10:07 PM (IST)

    డిమారియా ఔట్

    తమ జట్టు అద్భుతంగా ఆడుతుండడంతో అర్జెంటీనా అభిమానులు కూడా ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. 65వ నిమిషంలో అర్జెంటీనా తొలి మార్పు చేయగా.. రెండో గోల్ చేసిన డిమారియా ఔటయ్యాడు. బయటకు వెళ్లిన వెంటనే అభిమానులు చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు.

  • 18 Dec 2022 10:01 PM (IST)

    సెకండాఫ్‌ లోనూ అర్జెంటీనా దూకుడు

    సెకండాఫ్‌లోనూ అర్జెంటీనా దూకుడుగా ఆడుతోంది. మ్యాచ్‌ 58వ నిమిషంలో, డిమారియా బాక్స్ సమీపంలో అల్వారెజ్‌కు పాస్ చేశాడు, అతను అద్భుతమైన ఫస్ట్ టచ్‌తో డిఫెండర్‌ను ఓడించి ఎడమ పాదంతో షాట్ చేశాడు, అయితే లోరిస్ డైవ్ చేసి బంతిని అడ్డుకున్నాడు.

  • 18 Dec 2022 09:33 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: ముగిసిని తొలి అర్థభాగం..

    తొలి అర్ధభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలుత మెస్సీ 23వ నిమిషంలో పెనాల్టీ గోల్ చేశాడు. ఆ తర్వాత 36వ నిమిషంలో డిమారియా స్కోరును మరింత పెంచాడు.

    తొలి సగంలో అర్జెంటీనా మాత్రమే కనిపించింది. ప్రతి సందర్భంలో ఫ్రాన్స్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచింది. అర్జెంటీనా ఆధీనంలో 60% ఉండగా, అది 6 షాట్లను సాధించింది. ఇందులో 2 షాట్లు లక్ష్యానికి చేరుకున్నాయి.

    అదే సమయంలో, ఫ్రాన్స్ 40% ఆధీనంలో ఉంచుకోగలిగింది. తొలి సగంలో అర్జెంటీనాపై ఒక్కగోల్ కూడా చేయలేకపోయింది.

  • 18 Dec 2022 09:25 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: మొదటి అర్ధభాగంలో మరో 7 నిమిషాలు..

    మొదటి అర్ధభాగంలో 45 నిమిషాలు పూర్తయ్యాయి. ఇంజురీ టైమ్ 7 నిమిషాలు జోడించారు. ఈ 7 నిమిషాల్లో ఫ్రాన్స్ గోల్ సాధిస్తే రెండో అర్ధభాగంలో పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ 7 నిమిషాల్లోనూ ఫ్రాన్స్ గోల్ చేయలేకపోయింది. దీంతో అర్జెంటీనా టీం 2-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

  • 18 Dec 2022 09:21 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: 45 నిమిషాల తర్వాత ఆధిక్యంలోనే అర్జెంటీనా

    ఫిఫా ప్రపంచకప్ 2022లో ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో తొలి అర్ధభాగంలో అర్జెంటీనా 2 గోల్స్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 23వ నిమిషంలో లియోనెల్ మెస్సీ పెనాల్టీ గోల్ చేశాడు. ఆ తర్వాత 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా కూడా గోల్ చేయడంతో స్కోరు 2-0తో నిలిచింది. 45 నిమిషాల తర్వాత స్కోరు 2-0గా మారింది. తొలి గోల్ కోసం ఫ్రాన్స్ ఆరాపడుతోంది.

  • 18 Dec 2022 09:08 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: 2-0తో ఆధిక్యంలోకి అర్జెంటీనా

    వరుసగా రెండు గోల్స్ సాధించడంలో అర్జెంటీనా జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి గోల్ లియోనల్ మెస్సీ చేయగా, రెండో గోల్ ఏంజెల్ డిమారియా కొట్టాడు.

  • 18 Dec 2022 09:02 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: పీలేతో సమానంగా లియోనల్ మెస్సీ..

    మెస్సీ బ్రెజిల్‌కు చెందిన గ్రేట్ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలేను సమం చేశాడు. ప్రపంచకప్‌లో ఇద్దరూ సమానంగా 12 గోల్స్ చేశారు.

  • 18 Dec 2022 08:56 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: మెస్సీ మాయ.. తొలి గోల్‌తో ఆధిక్యంలోకి అర్జెంటీనా

    హోరీహోరీగా సాగుతోన్న ఫిఫా ఫైన‌ల్‌లో అర్జెంటీనా ఖాతాలోకి తొలి గోల్ చేరింది. పెనాల్టీని చక్కగా ఉపయోగించుకున్న అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. 22వ నిమిషంలో అద్బుతంగా ఆడి, ఫ్రాన్స్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి గోల్ చేశాడు. దీంతో 1-0తో అర్జెంటీనా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

  • 18 Dec 2022 08:51 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: ఫ్రాన్స్ తొలి దాడి..

    సుమారు 13 నిమిషాల పాటు, అర్జెంటీనా దాడులను రక్షించడంలో ఫ్రాన్స్ నిమగ్నమై, మొదటిసారి దాడికి ప్రయత్నించింది. డెంబెలే మిడ్‌ఫీల్డర్ రాబియోకు బంతిని పాస్ చేశాడు. ఎంబాప్పేతో కలిసి బాక్స్‌లోకి ప్రవేశించాడు. కానీ, గోల్ కీపర్ మార్టినెజ్ ఆ ప్రయత్నాన్ని విఫలం చేశాడు.

  • 18 Dec 2022 08:49 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: కార్నర్ నుంచి ప్రయత్నించినా.. గోల్ కొట్టని అర్జెంటీనా..

    8వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు డిపాల్ షాట్ బాక్స్ ముందు నుంచి గోల్‌కి కొట్టాడు. కానీ, రాఫెల్ వెరన్ మధ్యలోనే బంతిని ఆపేశాడు. బంతి కార్నర్‌కు వెళ్లింది.

    మ్యాచ్‌లో తొలి కార్నర్‌ అయితే అర్జెంటీనా దానిని గోల్‌గా మార్చలేకపోయింది.

  • 18 Dec 2022 08:47 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: మెస్సీ చేసిన ఫౌల్ ఫ్రాన్స్‌కు ఫ్రీ కిక్..

    ఫ్రెంచ్ లెఫ్ట్ బ్యాక్ ఆటగాడు థియో హెర్నాండెజ్ మైదానం మధ్యలో బంతితో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ, మెస్సీ అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే, మెస్సీ టాకిల్ సరైన సమయంలో ఫలించలేదు.

  • 18 Dec 2022 08:45 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: అర్జెంటీనాకు తొలి అవకాశం..

    స్ట్రయికర్ అల్వారెజ్ ఫ్రెంచ్ బాక్స్‌లోకి ప్రవేశించి బంతిని అందుకున్న మూడో నిమిషంలో అర్జెంటీనాకు మొదటి అవకాశం లభించింది. కానీ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. బంతిని ఆపేందుకు ఫ్రాన్స్ కీపర్ లోరిస్ డైవ్ చేశాడు. అయితే అంపైర్ అప్పటికే ఆఫ్‌సైడ్‌గా ప్రకటించాడు.

  • 18 Dec 2022 08:37 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: ఫైనల్ పోరు మొదలు..

    లుసైల్ స్టేడియంలో ఫుట్‌బాల్‌లో అతిపెద్ద పోరు మొదలైంది. ఫ్రెంచ్ జట్టు అర్జెంటీనాపై కుడి నుంచి ఎడమకు ఎటాక్ చేస్తోంది. అర్జెంటీనా 4-4-2 ఫార్మేషన్‌తో బరిలోకి దిగగా, ఫ్రాన్స్ 4-2-3-1తో పోటీపడుతోంది.

  • 18 Dec 2022 08:25 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: చరిత్ర సృష్టించిన మెస్సీ..

    ఫిఫా ఫైనల్‌కు చేరుకోవడంతో లియోనెల్ మెస్సీ తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 26 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంలో, అతను 25 మ్యాచ్‌లు ఆడిన మాజీ జర్మన్ వెటరన్ లోథర్ మథాస్‌ను విడిచిపెట్టాడు.

  • 18 Dec 2022 08:20 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్రాన్స్-అర్జెంటీనా ప్రారంభ ప్లేయింగ్ XI ఇదే..

    అర్జెంటీనా జట్టు: ఎమిలియానో ​​మార్టినెజ్ (గోల్‌కీపర్), లియోనెల్ మెస్సీ (కెప్టెన్), జూలియన్ అల్వారెజ్, ఎంజో ఫెర్నాండెజ్, ఏంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, అలెక్సిస్ మెక్‌అలిస్టర్, నాహుయెల్ మోలినా, క్రిస్టియన్ రొమెరో, నికోలస్ ఒటామెండి, నికోలస్ టాగ్లియాఫీ.

    ఫ్రాన్స్ జట్టు: హ్యూగో లోరిస్ (గోల్‌కీపర్ మరియు కెప్టెన్), ఒలివియర్ గిరౌడ్, కైలియన్ ఎంబాప్పే, ఆంటోయిన్ గ్రీజ్‌మన్, ఉస్మాన్ డెంబెలే, అడ్రియన్ రాబియోట్, ఆరేలియన్ చౌమెనీ, థియో హెర్నాండెజ్, దయోట్ ఉపమెకానో, రాఫెల్ వరనే, జూల్స్ కాండే.

  • 18 Dec 2022 08:08 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: ఇప్పటి వరకు విజేతల లిస్ట్ ఇదే..

    1930- ఉరుగ్వే

    1934- ఇటలీ

    1938- ఇటలీ

    1950- ఉరుగ్వే

    1954- జర్మనీ

    1958- బ్రెజిల్

    1962- అర్జెంటీనా

    1978- అర్జెంటీనా

    1978- జర్మనీ

    1974- ఇంగ్లాండ్

    1970- బ్రెజిల్

    1966- బ్రెజిల్

    2006 – ఇటలీ

    2010 – స్పెయిన్

    2014 – జర్మనీ

    2018 – ఫ్రాన్స్

  • 18 Dec 2022 08:05 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: ముగింపు వేడుకలో నోరా ఫతేహి ప్రదర్శన..

  • 18 Dec 2022 07:55 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: అర్జెంటీనా-ఫ్రాన్స్ రికార్డులు ఇవే..

    ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ల మధ్య కాసేపట్లో ఫైనల్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో రెండు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయాయి. ఈ ఫైనల్‌లో రెండు జట్లూ సమంగా నిలిచాయి. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన పరస్పర ఘర్షణల చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ అర్జెంటీనాదే పైచేయిగా నిలిచింది.

    అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 13 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో అర్జెంటీనా 6 మ్యాచ్‌లు గెలవగా, ఫ్రాన్స్ 3 విజయాలు మాత్రమే సాధించింది. 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అదే సమయంలో, ప్రపంచ కప్ చరిత్రలో, రెండు జట్లు 3 సార్లు ఢీకొన్నాయి. ఇక్కడ కూడా అర్జెంటీనా 2-1 ఆధిక్యంలో ఉంది.

  • 18 Dec 2022 07:41 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్ ప్రయాణం ఇదే..

    60 ఏళ్ల నాటి రికార్డును పునరావృతం చేయాలనే ధీమాతో ఫ్రాన్స్ జట్టు ఈ ఫైనల్‌కు దూసుకెళ్తోంది. 2018 ఛాంపియన్‌లు వరుసగా రెండో ప్రపంచకప్‌ను, ఓవరాల్‌గా మూడో ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఫ్రాన్స్ కూడా షాకింగ్ ఓటమిని చవిచూసింది. అయితే అది నిలకడగా రాణిస్తోంది. ఫ్రాన్స్ రికార్డును పరిశీలిస్తే-

    లీగ్ దశ

    ఫ్రాన్స్ vs ఆస్ట్రేలియా: విజయం (4-1)

    ఫ్రాన్స్ vs డెన్మార్క్: విజయం (2-1)

    ఫ్రాన్స్ vs ట్యునీషియా: ఓడిపోయింది (0-1)

    ప్రీ క్వార్టర్ ఫైనల్స్

    ఫ్రాన్స్ vs పోలాండ్: విజయం (3-1)

    క్వార్టర్ ఫైనల్స్

    ఫ్రాన్స్ vs ఇంగ్లాండ్: విజయం (2-1)

    సెమీ ఫైనల్

    ఫ్రాన్స్ vs మొరాకో: విజయం (2-0)

  • 18 Dec 2022 07:38 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: అర్జెంటీనా ఫైనల్‌ ప్రయాణం ఎలా సాగిందంటే?

    36 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకనున్న అర్జెంటీనా ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. తొలి మ్యాచ్‌లోనే సంచలన ఓటమి, ఆపై లియోనెల్ మెస్సీ అద్భుతం 8 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనాను టైటిల్‌కు చేరువ చేసింది. అర్జెంటీనా ప్రయాణంపై ఓ లుక్కేయండి-

    లీగ్ దశ..

    అర్జెంటీనా vs సౌదీ అరేబియా: ఓడిపోయింది (1-2)

    అర్జెంటీనా vs మెక్సికో: విజయం (2-0)

    అర్జెంటీనా vs పోలాండ్: విజయం (2-0)

    ప్రీ క్వార్టర్ ఫైనల్స్

    అర్జెంటీనా vs ఆస్ట్రేలియా: విజయం (2-1)

    క్వార్టర్ ఫైనల్స్

    అర్జెంటీనా vs నెదర్లాండ్స్: గెలిచింది (డ్రీ 2-2, పెనాల్టీల్లో 4-3తో ఓడించింది)

    సెమీ ఫైనల్

    అర్జెంటీనా vs క్రొయేషియా: విజయం (3-0)

  • 18 Dec 2022 07:35 PM (IST)

    FIFA World Cup 2022 Final Live Score: మరికొద్దిసేపట్లో ఫిఫా తుది సమరం..

    ఫిఫా ప్రపంచకప్‌లోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనల్ నేడు జరగనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు తలపడనున్నాయి. లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాప్పే చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.

Published On - Dec 18,2022 7:30 PM

Follow us