WTC 2023 Final: భారత్‌కు డబుల్ బొనాంజా.. సఫారీల చిత్తుతో రెండు గంటల్లోనే మారిపోయిన WTC పాయింట్ల పట్టిక

మొదట బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించగానే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడో స్థానానికి ఎగబాకింది. అయితే భారత్‌ విజయం సాధించిన 2 గంటల్లోపే ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకగా సౌతాఫ్రికా మూడో ప్లేసుకు పడిపోయింది.

WTC 2023 Final: భారత్‌కు డబుల్ బొనాంజా.. సఫారీల చిత్తుతో రెండు గంటల్లోనే మారిపోయిన WTC పాయింట్ల పట్టిక
Team India
Follow us
Basha Shek

|

Updated on: Dec 18, 2022 | 7:28 PM

డిసెంబర్ 18న, 2 టెస్ట్ మ్యాచ్‌ల ఫలితాలు 2 గంటల తేడాలో వచ్చాయి. దీని ప్రభావం నేరుగా WTC పాయింట్ల పట్టికపై పడింది. ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌-5లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలపై ప్రభావం చూపింది. మొదట బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించగానే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడో స్థానానికి ఎగబాకింది. అయితే భారత్‌ విజయం సాధించిన 2 గంటల్లోపే ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకగా సౌతాఫ్రికా మూడో ప్లేసుకు పడిపోయింది. రెండు గంటల్లోపే ఇదంతా చోటు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 76.92 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి ఫైనల్‌ బెర్తను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇక భారత జట్టు 55.77 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 54.55 పాయింట్లతో మూడు, 53.33 పాయింట్లతో శ్రీలంక నాలుగో స్థానంలో, ఇంగ్లండ్ 44.44 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. పాక్‌ 42.42 పాయింట్లతో ఆరో ప్లేస్‌లో ఉంది.

కాగా వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌కు ముందు టీమిండియా మరో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో మరో టెస్టుతో పాటు.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే టీమిండియా నేరుగా WTC ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిపోతే మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ ఫలితంపై ఆధారపడాల్సి వస్తుంది. సఫారీలను ఆసీస్‌ క్లీన్‌స్వీప్ చేయగలిగితే, భారత్ ఫైనల్ చేరడం మరింత సులువవుతుంది. దక్షిణాఫ్రికా ఒకటి లేదా రెండు టెస్టుల్లో గెలిచినా టీమిండియాకు ఇబ్బందికరమే. సో ఫైనల్ చేరుకోవాలంటే బంగ్లాతో జరిగే రెండో టెస్టుతో పాటు స్వదేశంలో జరిగే 4 టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించడం టీమిండియాకు తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..