Aryna Sabalenka: 2వసారి టైటిల్ పట్టేసిన అరినా సబలెంకా.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..?
US Open Prize Money Breakdown: యూఎస్ ఓపెన్‌లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా సబలెంకా రికార్డు సృష్టించింది. గతంలో 2012-2014 మధ్య సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిపోయిన తర్వాత, సబలెంకా ఈ విజయం సాధించడం ఆమెకు ఎంతో రిలీఫ్ ఇచ్చింది.

US Open Prize Money Breakdown: మహిళల టెన్నిస్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుతూ అగ్రశ్రేణి క్రీడాకారిణి అరినా సబలెంకా వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆమె అమెరికన్ స్టార్ అమండా అనిసిమోవాను 6-3, 7-6 (3) తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ విజయం ఆమె కెరీర్‌లో నాల్గవ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.
నిర్ణయాత్మక పోరాటం..
నిజానికి ఈ మ్యాచ్ రెండు పవర్-హిట్టర్ల మధ్య హోరాహోరీగా సాగింది. సబలెంకా తన శక్తివంతమైన సర్వ్‌లు, బేస్‌లైన్ షాట్‌లతో దూకుడు ప్రదర్శించగా, అనిసిమోవా కూడా అంతే పవర్‌తో ప్రతిఘటించింది. అయితే, కీలక సమయాల్లో సబలెంకా చూపిన అనుభవం, మానసిక దృఢత్వం ఆమెకు విజయాన్ని అందించాయి. తొలి సెట్‌లో సబలెంకా 6-3 తేడాతో సునాయాసంగా గెలిచింది. కానీ, రెండో సెట్‌లో అనిసిమోవా గట్టి పోటీనిచ్చింది. సబలెంకా 5-4 ఆధిక్యంతో మ్యాచ్ గెలిచేందుకు సర్వ్ చేస్తున్నప్పుడు, అనిసిమోవా అద్భుతంగా ఆడి బ్రేక్ చేసి స్కోర్‌ను 5-5తో సమం చేసింది. ఆ దశలో మ్యాచ్ మూడో సెట్‌కు వెళ్తుందా అని అందరూ అనుకున్నారు.
టైబ్రేక్‌లో ఆధిపత్యం..
అయితే, ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకుంటూ సబలెంకా టైబ్రేక్‌లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆమె తన పదునైన షాట్‌లతో అనిసిమోవాను గందరగోళానికి గురిచేసి 7-3 తేడాతో టైబ్రేక్‌ను గెలుచుకుని, మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.
సెరెనా విలియమ్స్ తర్వాత..
యూఎస్ ఓపెన్‌లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా సబలెంకా రికార్డు సృష్టించింది. గతంలో 2012-2014 మధ్య సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిపోయిన తర్వాత, సబలెంకా ఈ విజయం సాధించడం ఆమెకు ఎంతో రిలీఫ్ ఇచ్చింది. ఈ గెలుపుతో సబలెంకా మహిళల టెన్నిస్‌లో అగ్రస్థానంలో తన స్థానాన్ని మరింత పదిలపరుచుకుంది. అనిసిమోవా కూడా తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. వింబుల్డన్‌లో ఓటమి తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
సబలెంకా ప్రైజ్ మనీ ఎంతంటే?
టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా $90 మిలియన్ల మొత్తం బహుమతితో, 2025 యూఎస్ ఓపెన్ మునుపటి రికార్డులను బద్దలు కొట్టింది. 2024లో ప్రైజ్ మనీ $75 మిలియన్లుగా ఉండేది. పురుషులు, మహిళల ఛాంపియన్ల ప్రైజ్ మనీని చారిత్రాత్మక నిర్ణయంతో సమం చేశారు. 2024 యూఎస్ ఓపెన్ గెలిచినందుకు సబలెంకాకు $3.6 మిలియన్ల బహుమతి లభించింది. అయితే, సబలెంకాకు ఈ ఏడాది తన ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నందుకు ఆమెకు $5 మిలియన్లు అంటే, రూ. 44 కోట్లు దక్కనున్నాయి. అయితే, మహిళల సింగిల్స్‌లో రన్నరప్ అయిన అమండా అనిసిమోవాకు $2.5 మిలియన్లు లభిస్తాయి. అంటే, ప్రైజ్ మనీలో దాదాపు 39% పెరుగుదల కనిపించింది.
న్యూయార్క్‌లో సబలెంకా విజయం టోర్నమెంట్ రికార్డు $90,000,000 ప్రైజ్ పూల్ నుంచి ఆమెకు $5,000,000 (రూ. 44 కోట్లు) సంపాదించింది. అలాగే 2000 ర్యాంకింగ్ పాయింట్లు కూడా వచ్చాయి. అయితే, అనిసిమోవా $2,500,000(రూ. 22 కోట్లు) ప్రైజ్ మనీతోపాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో ఎలిమినేట్ అయిన తర్వాత నాల్గవ సీడ్ జెస్సికా పెగులా, మాజీ రెండుసార్లు టోర్నమెంట్ ఛాంపియన్, 23వ సీడ్ నవోమి ఒసాకా $1,260,000(రూ. 11 కోట్లు) అందుకున్నారు.
రెండవ సీడ్ ఇగా స్వియాటెక్, 11వ సీడ్ కరోలినా ముచోవా, బార్బోరా క్రెజ్సికోవా, మార్కెటా వొండ్రౌసోవా అందరూ క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్క్రమించారు. వీరిలో ఒక్కొక్కరు $660,000 (రూ. 5 కోట్లు) దక్కించుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








