Rafael Nadal Retirement: నా చివరి మ్యాచ్ ఇదే.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన 38 ఏళ్ల స్టార్ ప్లేయర్..

Rafael Nadal: టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని రారాజు రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించి, తన ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. 38 ఏళ్ల వయసులో తన అభిమాన క్రీడకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్న స్పెయిన్ లెజెండరీ టెన్నిస్ ఆటగాడు నాదల్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో ద్వారా పంచుకున్నాడు.

Rafael Nadal Retirement: నా చివరి మ్యాచ్ ఇదే.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన 38 ఏళ్ల స్టార్ ప్లేయర్..
Rafael Nadal
Follow us
Venkata Chari

|

Updated on: Oct 10, 2024 | 5:58 PM

Rafael Nadal: టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని రారాజు రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించి, తన ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. 38 ఏళ్ల వయసులో తన అభిమాన క్రీడకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్న స్పెయిన్ లెజెండరీ టెన్నిస్ ఆటగాడు నాదల్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో ద్వారా పంచుకున్నాడు. తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన నాదల్.. నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించాడు. నవంబర్ 19, 21 మధ్య జరిగే డేవిస్ కప్ ఫైనల్‌లో స్పెయిన్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

దీనిపై ఓ వీడియోను విడుదల చేసిన నాదల్.. ‘నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా గత రెండేళ్లు సవాలుతో కూడుకున్నవి. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ, జీవితంలో ప్రతి ప్రారంభానికి ముగింపు ఉంటుంది. నా కెరీర్‌ను ముగించుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ఇంత సుదీర్ఘ కెరీర్‌ను నేనెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు తన చివరి మ్యాచ్‌పై చాలా ఉత్సాహంగా ఉందని’ తెలిపాడు.

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నాదల్..

ప్రపంచంలోని గొప్ప టెన్నిస్ ఆటగాళ్ళలో ఒకరైన రాఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్ తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. నాదల్ తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోగా, జకోవిచ్ 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్నాడు. క్లే కోర్ట్‌లో రారాజుగా పేరుగాంచిన నాదల్ తన కెరీర్‌లో 14 ఫ్రెంచ్ ఓపెన్‌లను గెలుచుకున్నాడు. అంతేకాకుండా, అతను US ఓపెన్ 4 సార్లు, వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లను 2 సార్లు గెలుచుకున్నాడు. దీనికి తోడు 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో బంగారు పతకం సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..