AB Devilliers: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌కు ఏబీ డివిలియర్స్ కమ్‌బ్యాక్ లేనట్లే.!

AB Devilliers Re-Entry: మిస్టర్ 360.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఈ ఆటగాడు గ్రౌండ్‌లోకి అడుగుపెడితే...

AB Devilliers: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌కు ఏబీ డివిలియర్స్ కమ్‌బ్యాక్ లేనట్లే.!
Devilliers (1)
Follow us
Ravi Kiran

|

Updated on: May 18, 2021 | 9:01 PM

AB Devilliers Re-Entry: మిస్టర్ 360.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఈ ఆటగాడు గ్రౌండ్‌లోకి అడుగుపెడితే బౌలర్లకు చమట పట్టాల్సిందే. అతడు బౌండరీలతో విరుచుపడుతుంటే.. అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. ఎవరో కాదండీ.. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్.

క్రీజులో డివిలియర్స్ ఉన్నాడంటే.. టీంకు కొండంత బలం. ప్రత్యర్ధి టీంకు చెమటలు పడతాయి. పేసర్ లేదా స్పిన్నర్ ఎవరైనా కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. డివిలియర్స్ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. గత కొంతకాలంగా దేశీయ టీ20లలో డివిలియర్స్ చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ ముందుగా మళ్లీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా దానిపై క్లారిటీ వచ్చింది.

ఏబీ డివిలియర్స్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చే అవకాశాలు లేవని దక్షిణాఫ్రికా బోర్డు తేల్చి చెప్పేసింది. ఒకసారి తాను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అదే ఫైనల్ అని డివిలియర్స్ చెప్పినట్లుగా తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని డివిలియర్స్ అనుకోవట్లేదని స్పష్టం చేసింది. తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే విషయంపై అతడితో చర్చించామని.. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని డివిలియర్స్ క్లారిటీ ఇచ్చినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది.

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..