Vijay Hazare Trophy 2021: విశ్వరూపం ప్రదర్శించిన ముంబై ఓపెనర్ పృథ్వి షా.. ఒకే మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులు నమోదు..
Vijay Hazare Trophy 2021: దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ జట్టు హోరా హోరీగా తలడుతున్నాయి.
Vijay Hazare Trophy 2021: దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ జట్టు హోరా హోరీగా తలడుతున్నాయి. గురువారం నాడు జైపూర్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై జట్టు సంచలనం సృష్టించింది. భారత క్రికెట్ చరిత్రలోనే నమోదు కాని భారీ స్కోర్‌ను మంబై జట్టు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 457/4 పరుగులు చేసింది ముంబై టీమ్. ఇదే భారత గడ్డపై చేసి అత్యధిక స్కోర్ కావడం విశేషం. అయితే, ఇంత భారీ స్కోర్ చేయడానికి ముంబై జట్టు కెప్టెన్ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ లే కారణం. పృథ్వీ షా 157 బంతుల్లో 227 పరుగులు చేయగా, సూర్య కుమార్ యాదవ్ 58 బంతుల్లో 133 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు పాండిచేరిని హడలెత్తించారు.
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా గురువారం నాడు జైపూర్ వేదికగా ముంబై, పాండిచేరి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాండిచేరి టీమ్.. బౌలింగ్‌ను ఎంచుకుంది. దాంతో ముంబై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన ముంబై సెన్షేషన్ పృథ్వీ షా.. ఆది నుంచే వీర విహారం చేశాడు. డబుల్ సెంచరీ సాధించాడు. 152 బంతుల్లో 31 ఫోర్లు, 5 సిక్సర్లతో 227 పరుగులు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దేశవాళీ క్రికెటర్ సంజూ శాంసన్ పేరిట ఉన్న 212 వ్యక్తిగత పరుగుల రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు.. పురుషుల విభాగం లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా కూడా పృథ్వీ షా నిలిచాడు. ఇదిలాఉంటే.. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇంతకు ముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సేహ్వా్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేవీ కౌశల్, సంజూ శాంసన్‌లు డబుల్ సెంచరీలు సాధించారు. ఇప్పుడు వారి రికార్డులను బ్రేక్ చేస్తూ పృథ్వి షా నయా రికార్డ్ నెలకొల్పాడు.
ఇక పోతే.. సూర్య కుమార్ యాదవ్ 58 బంతుల్లో 133 పరుగులు(22 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి ప్రత్యర్థి జట్టు పాండిచ్చేరిని హడలెత్తించాడు. మొత్తంగా ఇద్దరి భాగస్వామ్యంలో జట్టు స్కోర్ 360 చేశారు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 10, ఆదిత్య తారే 56 పరుగులు చేశారు. దాంతో మంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 457 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేశవాళీ లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్. అంతకుముందు మధ్యప్రదేశ్‌పై జార్ఖండ్ 422/9 పుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాండిచ్చేరి జట్టు.. బౌలింగ్‌తో పాటు.. బ్యాటింగ్‌లోనూ విఫలమైంది. ముంబై తరువాత బ్యాటింగ్ చేసిన పాండిచ్చేరి టీమ్.. 224 పరుగులు చేసి ఘోర పరాజయం పాలైంది.
విజయ్ హజారే ట్రోఫీలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.. 1. పృథ్వీ షా- 227* – పాండిచేరిపై – 2020/21 2. సంజూ శాంసన్ – 212* – గోవా పై 2019/20 3. యశస్వీ జైస్వాల్ – 203 – జార్ఖండ్‌పై – 2019/20 4. కేవీ కౌశల్ – 203 – సిక్కిం పై – 2018/19 5. అజింక్య రహానే – 187 – మహారాష్ట్రపై – 2007/08
ఇప్పటి వరకు టీమిండియాక కూడా ఇంత భారీ స్కోర్‌ను నమోదు చేయలేదు. టీమిండియా అత్యధిక స్కోర్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.. 1. 418/5 – ఇండియా – వెస్ట్ ఇండీస్ – ఇండోర్ – డిసెంబర్ 8, 2011 2. 414/7 – ఇండియా – శ్రీలంక – రాజ్‌కోట్ – డిసెంబర్ 15, 2009 3. 413/5 – ఇండియా – బెర్ముడా – మ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ – మార్చి 19, 2007 4. 404/5 – ఇండియా – శ్రీలంక – కోల్‌కతా – నవంబర్ 13, 2014 5. 401/3 – ఇండియా – సౌతాఫ్రికా – గ్వాలియర్ – ఫిబ్రవరి 24, 2010 6. 392/4 – ఇండియా – న్యూజీలాండ్ – క్రిస్ట్ చర్చ్ – మార్చి 8, 2009
ప్రపంచ వ్యాప్తంగా పరుగులు చేసిన పురుషు లిస్ట్ ఏ జట్లు ఇవే.. 1. 496/4 – సర్రే vs గ్లౌసెస్టర్షైర్ – ది ఓవల్(ప్రాంతం) – 2007 2. 481/6 – ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా – నాటింగ్‌హమ్ – 2018 3. 458/4 – ఇండియా ఏ vs లీసెస్టర్షైర్ – లీసెస్టర్ – 2018 4. 457/4 – ముంబై vs పుదుచేరి – జైపూర్ – 2021
Also read:
వారిని వెంటనే బేషరుతుగా విడుదల చేయండి.. రాష్ట్రపతికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ..
అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ దుష్ప్రచారం, భారత్ ఖండన. సహించబోమని హెచ్చరిక