Farmers Protest: వారిని వెంటనే బేషరుతుగా విడుదల చేయండి.. రాష్ట్రపతికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ..

Samyukt Kisan Morcha: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు మూడునెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన పలు సంఘటనలకు..

Farmers Protest: వారిని వెంటనే బేషరుతుగా విడుదల చేయండి.. రాష్ట్రపతికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ..
Follow us

|

Updated on: Feb 25, 2021 | 5:46 PM

Samyukt Kisan Morcha: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు మూడునెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పలువురు రైతులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన తప్పుడు కేసులను తొలగించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. రైతు ఉద్యమ సమయంలో అరెస్టు చేసి జైలుకు పంపిన అమాయక రైతులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. దీంతోపాటు వారిపై పెట్టిన తప్పుడు కేసులను.. ఇప్పటికే పంపించిన నోటీసులను రద్దు చేయాలని కోరారు.

గత మూడు నెలలనుంచి దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని ఆందోళన జరుగుతుందని లేఖలో వివరించారు. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుందన్నారు. ఈ ఉద్యమంలో ఇప్పటివరకు వందలాది మంది రైతులను, ఉద్యమానికి మద్దతిస్తున్న వారిని అరెస్ట్ చేసి.. తప్పుడు కేసులు బనాయించారని లేఖలో వెల్లడించారు. వారిపై మోపిన కేసులను కొట్టివేసి.. వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రపతిని కోరింది.

కాగా.. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర కాలం పాటు నిలుపుదల చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు అంగీకరిస్తే, మళ్లీ చర్చలు నిర్వహించేందుకు సంద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ బుధవారం వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత అన్ని అంశాలపై రైతు సంఘాలతో చర్చిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే.. నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటివరకు 12 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జనవరి 22న చర్చలు జరిగాయి. అయితే ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలు మాత్రమే చేస్తామంటూ కేంద్రం పేర్కొంటోంది. అయితే చట్టాల రద్దుకు కేంద్రం ఒప్పుకోకపోవడంతో రైతు సంఘాలు ప్రత్యేక కార్యచరణకు సిద్ధమయ్యాయి. భారత్ బంద్‌తోపాటు.. ఈ సారి పార్లమెంట్ ముట్టడికి పిలుపునిస్తామని వెల్లడించాయి.

India Slams Pak: అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ దుష్ప్రచారం, భారత్ ఖండన. సహించబోమని హెచ్చరిక

Nirav Modi: నీరవ్ మోదీకి షాక్.. ఆధారాలు రుజువయ్యాయి.. భారత్‌కు అప్పగించండి: యూకే కోర్టు సంచలన తీర్పు

Latest Articles