సెహ్వగ్, రోహిత్ శర్మల రికార్డు బ్రేక్ చేసిన పృథ్వీ షా.. వన్డేల్లో మరో డబుల్ సెంచరీ నమోదు..!
విజయ్ హజారే ట్రోఫీలో గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ లో 21 సంవత్సరాల ముంబై కెప్టెన్ పృథ్వీ షా(Prithvi Shaw) సూపర్బ్ ఇన్నింగ్స్...
Prithvi Shaw Smashes Double Century: విజయ్ హజారే ట్రోఫీలో గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ లో 21 సంవత్సరాల ముంబై కెప్టెన్ పృథ్వీ షా(Prithvi Shaw) సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన అతడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 152 బంతుల్లో 227 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 31 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు అని చెప్పవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 154 పరుగులలో అతడికి ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. ఇక గత మూడు మ్యాచ్‌లు పృథ్వీ షా స్కోర్ గురించి ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీపై సెంచరీ కొట్టగా.. మహారాష్ట్రపై 34 పరుగులు చేసాడు.
డొమెస్టిక్ క్రికెట్ లో వేగంగా డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో పృథ్వీ షా నాలుగో స్థానంలో నిలిచాడు, శిఖర్ ధావన్, కర్ణ కౌషల్, వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇక షా లిస్ట్-ఏ మ్యాచ్‌లలో అతిపెద్ద ఇన్నింగ్స్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గ్రేమ్ పొలాక్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల రికార్డును బ్రేక్ చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ 58 బంతుల్లో 133 పరుగులు…
పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 58 బంతుల్లోనే 133 పరుగుల చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. వరుస ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడంటే.. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం ఏమేరకు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సూర్యకుమార్ యాదవ్ వేగానికి పంకజ్ సింగ్ బ్రేక్ వేశాడు. 47వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ప్రయతించిన సంగనకల్ సింగ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్యకుమార్ మొత్తం 133 పరుగులు చేయగా.. కేవలం 58 బంతుల్లోనే ఆ స్కోర్ అందుకోవడం విశేషం. (Prithvi Shaw Smashes Double Century)
152 బంతుల్లో 227 పరుగులు…భీకర విధ్వంసం..
ముంబై కెప్టెన్ పృథ్వీ షా సెంచరీని 65 బంతుల్లో పూర్తి చేయగా.. ఆ ఫీట్‌ను అందుకోవడంలో 18 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీని తరువాత, అతను 77 బంతుల్లో డబుల్ సెంచరీని చేరుకున్నాడు. ఈ తరుణంలో అతడు 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ విధంగా 152 బంతుల్లో 27 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో డబుల్ సెంచరీకి చేరుకోగలిగాడు. అంతకుముందు ఫిబ్రవరి 21న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో షా 89 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 105 నాటౌట్గా నిలిచాడు. ఇక ఫిబ్రవరి 23న మహారాష్ట్రపై 38 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఈ డబుల్ సెంచరీతో, షా ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
టీం ఇండియా తరఫున 5 టెస్టులు, 3 వన్డేలు ఆడిన పృథ్వీ షా..
పృథ్వీ షా అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే, టీమ్ ఇండియా తరఫున 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 339 పరుగులు చేశాడు, సగటున 42.37 కాగా, అందులో 1 సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, అతను 3 వన్డేలలో 28 సగటుతో 84 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పృథ్వీ షా 25 మ్యాచ్‌ల్లో 51.43 సగటుతో 2263 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. షా 35 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 44.79 సగటుతో 1523 పరుగులు చేశాడు. ఇందులో అతను 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు సాధించగా, అతని స్ట్రైక్ రేట్ 117.33. అదే సమయంలో, అతను 51 దేశీయ టి 20 మ్యాచ్‌లలో తన బ్యాట్‌తో 23.52 సగటుతో 1200 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 10 అర్ధ సెంచరీలు చేసాడు.
మరిన్ని ఇక్కడ చదవండి:
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!
Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్ చేసిన రియల్ హీరో.. చివరికి ఏమైందంటే.!
ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?