కుంబ్లే సరసన మేఘాలయ కుర్ర క్రికెటర్.. అరుదైన సూపర్ ఫీట్

మేఘాలయకు చెందిన ఓ కుర్ర క్రికెటర్ అరుదైన సూపర్‌ ఫీట్ సాధించాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా(15) ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. 21 ఓవర్లు వేసిన ఈ కుర్రాడు 51 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. ఇక నిర్దేశ్ స్పిన్ దెబ్బకు నాగాలాండ్ తొలిరోజు 113 పరుగులకే కుప్పకూలింది. అంతేకాదు మీరట్‌కు చెందిన ఈ కుర్రాడు గత రెండేళ్లుగా మేఘాలయ తరఫున […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:29 pm, Thu, 7 November 19
కుంబ్లే సరసన మేఘాలయ కుర్ర క్రికెటర్.. అరుదైన సూపర్ ఫీట్

మేఘాలయకు చెందిన ఓ కుర్ర క్రికెటర్ అరుదైన సూపర్‌ ఫీట్ సాధించాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా(15) ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. 21 ఓవర్లు వేసిన ఈ కుర్రాడు 51 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. ఇక నిర్దేశ్ స్పిన్ దెబ్బకు నాగాలాండ్ తొలిరోజు 113 పరుగులకే కుప్పకూలింది. అంతేకాదు మీరట్‌కు చెందిన ఈ కుర్రాడు గత రెండేళ్లుగా మేఘాలయ తరఫున అండర్-16 జట్టులో ఆడుతున్నారు. ఈ క్రమంలో గత సిరీస్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు నిర్దేశ్. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే 1999లో టీమిండియా లెగ్‌స్పిన్నర్ అనీల్ కుంబ్లీ ఢిల్లీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులకు  10 వికెట్లను తీశాడు. అలాగే గత ఏడాది మణిపూర్‌కు చెందిన 18ఏళ్ల యువ పేస్ బౌలర్ రెక్స్ సింగ్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లను తీసి రికార్డు సృష్టించాడు. అలాగే సీకే నాయుడు ట్రోఫీలో పాండిచ్చేరికి చెందిన ఎడమచేతివాటం స్పిన్నర్ సిదక్ సింగ్ మణిపూర్‌పై 10 వికెట్లతో సత్తా చాటిన విషయం తెలిసిందే.