ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇక..!

ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలను రద్దు చేయాలని బీసీసీఐ తీర్మానించినట్టు సమాచారం. ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అసలు బీసీసీఐకి టీమిండియా ఆడే మ్యాచ్‌ల కంటే.. ఐపీఎల్ ద్వారానే వచ్చే ఆదాయమే అత్యధికంగా ఉంటుందని క్రికెట్ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇలా కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు.. ప్రతీ ఏడాది ప్రారంభ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా.. ఆరంభ […]

ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇక..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 07, 2019 | 7:06 AM

ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలను రద్దు చేయాలని బీసీసీఐ తీర్మానించినట్టు సమాచారం. ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అసలు బీసీసీఐకి టీమిండియా ఆడే మ్యాచ్‌ల కంటే.. ఐపీఎల్ ద్వారానే వచ్చే ఆదాయమే అత్యధికంగా ఉంటుందని క్రికెట్ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇలా కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు.. ప్రతీ ఏడాది ప్రారంభ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా.. ఆరంభ వేడుకలను.. బీసీసీఐ రద్దు చేయాలనుకుంటుందట.

ప్రారంభ వేడుకలకు డబ్బు అనవసరంగా ఖర్చు అవుతోందని.. అందులోనూ.. అభిమానులు కూడా వీటిపై ఆసక్తి చూపకపోవడంతోనే.. వీటిని రద్దు చేయాలనుకుంటుందట.. బీసీసీఐ. అలాగే.. ఈ వేడుకల్లో పాల్గొన్న నటీనటులకు, కళాకారులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోందని.. అందులో ఐపీఎల్-2020 సీజన్ నుంచి ప్రారంభ వేడుకలు లేకుండా.. టోర్నీలు కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందని.. ఓ అధికారి తెలిపారు. అలాగే.. మరోకారణమేమంటే.. పూల్వామా ఉగ్రదాడిలో పలువురు జవాన్లు అమరులు అయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి సీఓఏ వేడకలను రద్దు చేసి.. ఆ మొత్తం ఖర్చులో సగం భారత సైన్యానికి విరాళం ఇచ్చింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అలానే చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!