AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫైనల్స్ విషయంలో సస్పెన్స్

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 12వ సీజన్ మొదలు కానుంది. ఈ నెల 23న తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. ఇది ఇలా ఉంటే రాబోతున్న లోక్ సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తొలుత ఐపీఎల్ తొలి రెండు వారాలకు సంబంధించిన షెడ్యూల్ ని మాత్రమే రిలీజ్ చేశారు. అయితే దీనిపై మరిన్ని చర్చలు జరిపి బీసీసీఐ మంగళవారం పూర్తి షెడ్యూల్ ని విడుదల చేశారు. మార్చి 23 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్న […]

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫైనల్స్ విషయంలో సస్పెన్స్
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:17 PM

Share

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 12వ సీజన్ మొదలు కానుంది. ఈ నెల 23న తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. ఇది ఇలా ఉంటే రాబోతున్న లోక్ సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తొలుత ఐపీఎల్ తొలి రెండు వారాలకు సంబంధించిన షెడ్యూల్ ని మాత్రమే రిలీజ్ చేశారు. అయితే దీనిపై మరిన్ని చర్చలు జరిపి బీసీసీఐ మంగళవారం పూర్తి షెడ్యూల్ ని విడుదల చేశారు. మార్చి 23 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్న లీగ్ మ్యాచ్ ల వివరాలను ఐపీఎల్ వెబ్ సైట్ లో పొందుపరిచారు. కాగా తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరగనుండగా.. చివరి మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది.

అయితే తొలి ఫైనల్ మ్యాచ్ ను మే 12న నిర్వహిస్తున్నట్లు వెబ్ సైట్ లో పొందుపరిచారు. కానీ ఏమైందో ఏంటో కొద్ది క్షణాల్లోనే ప్లే ఆఫ్స్, ఫైనల్ వివరాలను తొలిగించారు. దీనితో ఈ ఏడాది ఫైనల్స్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Follow Us