AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రో’హిట్’ ఈ సారి ఓపెనర్‌గా..

ముంబయి: రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో విద్వంసకర ఓపెనర్‌గా సేవలందిస్తున్న ఈ క్రేజీ బ్యాట్స్‌మన్ ఈ సారి ఐపీఎల్‌లో సైతం ఓపెనర్‌గా అదరగొట్టనున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా రోహిత్ శర్మానే కన్ఫార్మ్ చేశాడు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌శర్మ మంగళవారం టీమ్‌ మెంటర్‌ జహీర్‌ఖాన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ.. తాను ఈ సీజన్‌ మొత్తం ఓపెనింగ్‌ బ్యాట్సమెన్‌గా దిగుతానని అన్నాడు. గతేడాది ఏ స్థానంలోనూ రోహిత్‌ కుదురుకోకపోవడంతో […]

రో'హిట్' ఈ సారి ఓపెనర్‌గా..
Ram Naramaneni
|

Updated on: Mar 19, 2019 | 3:49 PM

Share

ముంబయి: రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో విద్వంసకర ఓపెనర్‌గా సేవలందిస్తున్న ఈ క్రేజీ బ్యాట్స్‌మన్ ఈ సారి ఐపీఎల్‌లో సైతం ఓపెనర్‌గా అదరగొట్టనున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా రోహిత్ శర్మానే కన్ఫార్మ్ చేశాడు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌శర్మ మంగళవారం టీమ్‌ మెంటర్‌ జహీర్‌ఖాన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ.. తాను ఈ సీజన్‌ మొత్తం ఓపెనింగ్‌ బ్యాట్సమెన్‌గా దిగుతానని అన్నాడు. గతేడాది ఏ స్థానంలోనూ రోహిత్‌ కుదురుకోకపోవడంతో ఈసారి ఓపెనింగ్‌ చేస్తానని ప్రకటించాడు.

ఇక యువరాజ్ సింగ్ రాకతో ముంబై ఇండియన్స్‌ మిడిల్‌ఆర్డర్‌ మరింత బలంగా మారిందని రోహిత్‌ చెప్పాడు. గత మూడు నాలుగు ఐపీఎల్‌ సీజన్లలో సరిగ్గా ఆడని యూవీ ఈసారి తమ జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని విశ్వాసం వ్యక్తంచేశాడు. ముంబయి ఇండియన్స్‌కు యూవీ అదనపు బలంగా మారుతాడు. తప్పకుండా మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడని చెప్పాడు. అనంతరం జహీర్‌ మాట్లాడుతూ.. ఒక్కోసారి ఆటగాళ్లు మొదటి వేలంలో అమ్ముడుపోరని, తర్వాత వారి అనుభవం రిత్యా రెండో వేలంలో అమ్ముడుపోతారని చెప్పాడు. అలాగే తమకు యూవీ దొరికాడని పేర్కొన్నాడు. యూవీ రాకతో తమ మిడిల్‌ఆర్డర్‌ బలంగా మారిందన్నాడు. గతేడాది ప్లే ఆఫ్‌ దశలోనే ముంబయి ఇండియన్స్‌ వెనుతిరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రోహిత్‌.. ఈసారి మంచి ప్రదర్శన చేసేందుకు తమ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. ఇప్పటికే తాను ఆటగాళ్లతో మాట్లాడడని.. వారంతా ఈసారి మంచి ప్రదర్శన చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించాడు.

Follow Us