AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్సీబీ…మీరెప్పుడు కప్ కొడుతున్నారు?

బెంగుళూరు: మరో 4 రోజులు…నాలుగంటే నాలుగు రోజులు ప్రపంచ క్రికెట్ అభిమానులను ఊపేసే పొట్టి క్రికెట్ ఐపీఎల్ ఆరంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం సోమవారం తన జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేశాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో 2008 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్‌కోహ్లీ ఇప్పటివరకూ […]

ఆర్సీబీ...మీరెప్పుడు కప్ కొడుతున్నారు?
Ram Naramaneni
|

Updated on: Mar 19, 2019 | 3:50 PM

Share

బెంగుళూరు: మరో 4 రోజులు…నాలుగంటే నాలుగు రోజులు ప్రపంచ క్రికెట్ అభిమానులను ఊపేసే పొట్టి క్రికెట్ ఐపీఎల్ ఆరంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం సోమవారం తన జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేశాడు.

ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో 2008 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్‌కోహ్లీ ఇప్పటివరకూ మూడు ఫైనల్స్‌లో ఆడాడు. ఈ మూడు మ్యాచుల్లో ఆర్సీబీ ఓటమి చవిచూసింది. ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. ఆర్సీబీ మొదటిసారి 2009లో డెక్కన్‌ చార్జర్స్‌ చేతిలో ఓటమిపాలైనప్పుడు కోహ్లీ యువ ఆటగాడిగా ఉన్నాడు. తర్వాత 2011లో రెండోసారి ఫైనల్‌ చేరినప్పుడు టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఒకడిగా ఉన్నాడు. అనంతరం మూడోసారి తన సారథ్యంలోనే 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ నేపథ్యంలో రాబోయే వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ సారథ్యంలో టీమిండియా మొదటిసారి మెగా ఈవెంట్‌లో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి వన్డే ప్రపంచకప్‌ ఫేవరెట్‌ జట్లలో టీమిండియా ఒకటిగా కనిపిస్తున్న సందర్భంగా కోహ్లీ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. అలాగే ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఆర్సీబీకి అందనిద్రాక్షలా మారిన టైటిల్‌ను కోహ్లీ ఈ సారి అందిస్తారని అభిమానులు ఆశగా చూస్తున్నారు.

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే