DC vs LSG, IPL 2024: అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
Delhi Capitals vs Lucknow Super Giants: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ అభిషేక్ పొరెల్ ( 33 బంతుల్లో 58, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆరంభంలో అదరగొట్టగా, ఆఖరులో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 57 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.
Delhi Capitals vs Lucknow Super Giants: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ అభిషేక్ పొరెల్ ( 33 బంతుల్లో 58, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆరంభంలో అదరగొట్టగా, ఆఖరులో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 57 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అలాగే షై హోప్ ( 27 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్ ( 23 బంతుల్లో 33, 5 ఫోర్లు) కూడా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ 2, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇప్పుడు ఈ టార్గెట్ ను ఛేదించాల్సిన బాధ్యత లక్నో సూపర్ జెయింట్ బ్యాటర్లపై నే ఉంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోతే ప్లేఆఫ్‌ల లెక్కలు చాలా క్లిష్టంగా మారతాయి. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ చాలా తక్కువ. అందుకే, RCB, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ తెలియకుండానే లాభపడతాయి.
ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు.. వీడియో ఇదిగో..
Two stylish strokes, 1 result 💥
Tristan Stubbs reaches his fifty in style 🚀
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/4DacwQUuFP
— IndianPremierLeague (@IPL) May 14, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్ /వికెట్ కీపర్) , ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
KL రాహుల్ (కెప్టెన్ /వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
మణిమారన్ సిద్ధార్థ్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్
కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో..
Taken on the second attempt 😎
Partnership broken thanks to a Klassy catch 💪
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvLSG | @klrahul | @LucknowIPL pic.twitter.com/0EVa392SKT
— IndianPremierLeague (@IPL) May 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..