- Telugu News Photo Gallery Science photos Which companies are launching new smartphones in the New Year, Smart Phones Launch details in telugu
Smart Phones Launch: న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్.. ఏయే కంపెనీలు ఫోన్లు లాంచ్ చేస్తున్నాయంటే?
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం భారీగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న జనాభాకు అనుగుణంగా పెద్ద స్థాయిలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ ఫోన్స్ కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్స్ భారతదేశంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది చాలా కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. 2025లో లాంచ్ అయ్యే ఫోన్లపై ఓ లుక్కేద్దాం.
Srinu |
Updated on: Dec 21, 2024 | 7:19 PM

సామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ని వచ్చే 2025 జనవరిలో విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా అనే మూడు మోడల్‌లు ఉంటాయి. ఫీచర్ల పరంగా స్నాప్ డ్రాగన్ లేదా ఎక్సినోస్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ వన్ యూఐ 7తో పని చేస్తుందని చెబుతున్నారు.

యాపిల్ కంపెనీ 2025 చివరి నాటికి ఐఫోన్ 17 లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే యాప్ ఐఫోన్ 17 స్లిమ్‌ను లాంచ్ చేస్తుందా? లేదా? అనే విషయం ఇంకా క్లారిటీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఐ ఫోన్ 17 అప్‌గ్రేడ్ చేసిన ఏ సిరీస్ ప్రాసెసర్‌లతో పాటు కొన్ని కెమెరా, బ్యాటరీ మెరుగుదలల ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్‌కి మరిన్ని ఏఐ పవర్డ్ ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

వన్ ప్లస్ 13 సిరీస్ జనవరి 7 లాంచ్ అవ్వనుంది. వన్ ప్లస్ 13 రెండు వెర్షన్లను రిలీజ్ చేస్తుంది. వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13 ఆర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 కోసం కొత్త కలర్ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తుంది. వన్ ప్లస్ కూడా స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ ఆధారంగా పని చేయనుంది.

ఆసస్ కంపెనీ తన రగ్ ఫోన్ 9 ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే ఈ ఫోన్ 2025 ప్రారంభంలో భారతీయ మార్కెట్‌కి కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఆధారంగా పని చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 15 ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉంటుంది.

ఎంఐ 15 కూడా వచ్చే ఏడాది లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తుంది. 6.36 అంగుళాల డిస్‌ప్లే సైజ్ ఈ ఫోన్ ప్రత్యేకత.





























