WTC Final: టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత జట్టులో ఆ బౌలర్లు ఉండాల్సిందే.. కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర విశ్లేషణ..

WTC Final: వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న టీమిండియా.. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే డబ్ల్యుటిసి ఫైనల్‌లో మ్యాచ్‌లో..

WTC Final: టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత జట్టులో ఆ బౌలర్లు ఉండాల్సిందే.. కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర విశ్లేషణ..
Jadeja And Ashwin
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 06, 2021 | 7:24 PM

WTC Final: వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న టీమిండియా.. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే డబ్ల్యుటిసి ఫైనల్‌లో మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ కోసం టీమిండియ అన్న అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఈ సౌతాంప్టన్ క్రికెట్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టులో ఐదుగురు బౌలర్లను దించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూటిసి ఫైన్‌లో టీమ్ ఇండియాలో అశ్విన్, జడేజా ఇద్దరినీ ఆడించాలా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

న్యూజిలాండ్ టీమ్‌లో స్పిన్ బౌలింగ్ సమర్థంగా వేసే బౌలర్లు లేరని ఆకాష్ అభిప్రాయపడ్డారు. జడేజా, అశ్విన్ సహా ఐదుగురు బౌలర్లను భారత్ ఆడిస్తే ఫలితం ఉంటుందన్నారు. ఇంగ్లండ్‌ గడ్డపై వీరు బాగా రాణిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇంగ్లండ్ క్రికెట్ స్టేడియంలు స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలంగా లేకపోవచ్చునని అంటూనే.. బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలని పేర్కొన్నారు.

‘‘అవును.. ఇంగ్లండ్‌లో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ, అది యూని-డైమెన్షనల్ అటాక్ అయినప్పుడు బ్యాటింగ్ సులభం అవుతుందనే చాలాసార్లు గమనించాం. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా గతంలో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడింది. ఇప్పుడు కూడా భారత జట్టు ఆ విధానాన్నే అనుసరిస్తే ఇద్దరు స్పిన్నర్లు ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం అవుతారు.’’ అని ఆకాష్ అభిప్రాయపడ్డారు.

రిషబ్ బంత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడని ఆకాష్ చోప్రా పేర్కొన్నారు. జడేజా, అశ్విన్ బ్యాటింగ్‌ స్టైల్ కూడా టీమిండియాకు ఒక అవకాశంగా మారుతుందన్నారు. ‘‘రిషబ్ పంత్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాలి. జడేజా 7వ స్థానంలో, అశ్విన్ 8వ స్థానంలో ఆపై ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు బ్యాటింగ్‌కు దిగాలి.’’ అని ఆకాష్ చొప్పు విశ్లేషించారు.

సౌతాంపట్లన్ పిచ్‌ స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉంటుందని, ఇండియా చివరి రెండు ఇంగ్లండ్ టూర్‌లను పరిశీలిస్తే అర్థమవుతోంది. సౌతాంప్టన్‌ పిచ్‌ స్పిన్ బౌలింగ్‌కు అద్భఉతంగా ఉంటుందని ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ ప్రూవ్ చేసి చూపాడు. ఈ రెండు టెస్టుల్లోనూ ఆఫ్ స్పిన్నర్ 17 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.

Also read:

Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుని ఎంపికలో కొత్త ట్విస్ట్.. కన్నడ ఫార్ములాకు సోనియా గ్రీన్ సిగ్నల్!