Peepal Tree: సంతానోత్పత్తి, నపుంసకత్వం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా.. రావితో చక్కటి పరిష్కారం అంటున్న ఆయుర్వేదం

Peepal Tree: హిందువులు పవిత్రం భావించి దేవతా స్వరూపంగా కొలిచే చెట్లలో ఒకటి రావి చెట్టు. ఈ చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. రావి ఆకులు,..

Peepal Tree: సంతానోత్పత్తి, నపుంసకత్వం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా.. రావితో చక్కటి పరిష్కారం అంటున్న ఆయుర్వేదం
Peepal Tree
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2021 | 6:57 PM

Peepal Tree: హిందువులు పవిత్రం భావించి దేవతా స్వరూపంగా కొలిచే చెట్లలో ఒకటి రావి చెట్టు. ఈ చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. రావి ఆకులు, కాయలు, బెరడులకు అనేక రోగాలను మాయం చేసే శక్తి ఉంది.పూర్వం చిన్న పిల్లలకు సరిగా మాటలు రాకపోతే రావి చిగురు ఆకును కూడా తినిపించేవారట. అంతేకాదు పాము కాటు, ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాము కాటు తదితర సమస్యలకు ఇది మందుగా రావి ఉపయోగపడుతుంది. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.

రావి ఆకు కషాయం ఉపయోగాలు తయారీ గురించ్ఝి తెలుసుకుందాం..!

కషాయం తయారు చేయు విదానం: రావి ఆకులను 5 లేదా 6 తీసుకుని మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ మంచి నీటిని తీసుకుని రావి ఆకులను దాంట్లో వేయాలి. ఆ నీటిని 4 నిమిషాలు వె డి చేయాలి. తరువాత ఆ నీటిని వడ పోసి, చల్లగా కానీ గోరు వెచ్చగా కానీ దానిని త్రాగాలి.

ఇలా ఈ రావి ఆకు కషాయం స్త్రీపురుషులకు కూడా మేలు చేస్తుంది. ఈ కాషాయం తాగడం వలన వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఆడవారికి నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా పీసీఓడీ సమస్యలున్న మహిళలు రావి ఆకుల కాషాయం అమృతంతో సమానం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

అంతేకాదు ఈ రావి ఆకులు, బెరడులను ఆయుర్వేద వైద్యంలో అనేక వ్యాధులకు నివారణలలో భాగంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యం మరియు అందం కోసం రావిని ఇచ్చే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. .

1. ఉబ్బసం కోసం:

రావి చెట్టు బెరడు , దాని పండిన పండ్లు ఉబ్బసం చికిత్సకు సహాయపడతాయి. బెరడు మరియు పండ్ల పొడిని విడిగా తయారు చేసి, ఆపై రెండింటినీ సమాన పరిమాణంలో కలపండి. ఉబ్బసం నుండి ఉపశమనం కోసం ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోండి.. ఇలా 14 రోజులు చేస్తే ఉబ్బసం నుంచి విముక్తి పొందవచ్చు

2. ఆకలి పెంచడానికి:

రావి చెట్టు యొక్క పండిన పండ్లను తినడం ఆకలిని కలిగిస్తాయి. ఈ పండ్లు తినడంతో కడుపులో మంట తగ్గుతుంది.

3.అధిక బరువుతో బాధపడేవారు:

అధిక బరువుతో బాధపడేవారు నాలుగు రావిఆకులను గ్లాసున్నర నీటిలో వేసి ఒక గ్లాసు నీరు అయ్యే వరకు మరిగించి తాగడం వల్ల బరువు తగ్గుతారు.

4. తామర మరియు దురద కోసం

తామర మరియు దురద చికిత్సకు సహాయపడే టీని తయారు చేయడానికి పీపాల్ ట్రీ బెరడు ఉపయోగపడుతుంది. అంతేకాదు తామర దురద ల నుంచి ఉపశమనం పొందడానికి రావి చెట్టు బెరడు, ఆకుల కాల్చి బూడిదగా చేసి దానిని తామర ఉన్న ప్రదేశము పై అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుంది.

5. ప్రకాశవంతమైన రంగు కోసం

రావి చెట్టు మరియు మర్రి చెట్టు నుండి వచ్చిన బెరడు ఆయుర్వేద సౌందర్య చికిత్సల కోసం ఉపయోగిస్తారు.

6. పగుళ్లు మడమల కోసం

రావి చెట్టు నుండి సేకరించిన పాలను లేదా దాని ఆకుల సారాన్ని మడమల పగుళ్లు పై రాయాలి. ఇది కాళ్ళను మృదువుగా మరియు పగుళ్ళను నయం చేయడంలో సహాయపడుతుంది.

7. పంటి నొప్పి కోసం

రావి చెట్టు బెరడు మరియు మర్రి చెట్టు బెరడును సమాన పరిమాణంలో నీటిలో ఉడకబెట్టాలి. ఈ నీరుతో క్రమం తప్పకుండా నోటి ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. పంటి నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది.

9. మలబద్ధకం కోసం

రావి పండ్లను, ఆకులను మలబద్దకం తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆకులను ఎండబెట్టి వాటిని పొడిగా చేయాలి. దానికి సోంపు గింజలు, బెల్లం సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. రోజుకు 5-10 రావి పండ్లను తిన్నా సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది.

10. విరేచనాలకు

విరేచనాలు తగ్గడానికి రావి చెట్టు కాండం మంచి ఔషధంగా పనిచేస్తుంది. రావి చెట్టు కాండం, ధనియాలు, పట్టిక బెల్లం సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసి 3-4 గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.

11. రక్త శుద్దీకరణ కోసం

రక్తంలో మలినాలు ఏర్పడటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్త శుద్ధి కోసం కూడా రావి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.

12. పాము కాటు కోసం

పాము కాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల విషం ప్రభావం తగ్గుతుంది.

13. నపుంసకత్వం సమస్యకు

నపుంసకత్వం సమస్య నుంచి బయటపడటానికి కూడా రావి ఉపయోగపడుతుంది. అర స్పూన్ రావి పండ్ల పొడిని పాలలో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. తద్వారా శరీరానికి బలం వచ్చి, నపుంసకత్వం నుంచి బయటపడొచ్చు. తగిన మోతాదులో రావి పండ్లు, దాని వేర్లు, శొంఠిని కలపాలి. పాలు, తేనె, పట్టిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

Also Read: మందు దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తున్న పవిత్ర యమున .. దీనికారణం తెలిస్తే షాక్ తినడం కాయం