కోచ్‌గా శాస్త్రి గారు కొనసాగితే నేను హ్యాపీనే: కోహ్లీ

టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగితే తనకు సంతోషమేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌తోనే రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటన ముగిసే వరకు ఆయన పదవీకాల గడువు పెంచింది బీసీసీఐ. తాజాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కోహ్లీ పలు విషయాలపై స్పందించారు. టీమిండియా హెడ్ కోచ్‌ విషయంపై క్రికెట్ సలహా కమిటీ నన్ను సంప్రదించలేదు. అయితే రవిశాస్త్రితో ఇప్పుడు ఉన్న ఆటగాళ్లందరికీ మంచి బంధం ఉంది. […]

కోచ్‌గా శాస్త్రి గారు కొనసాగితే నేను హ్యాపీనే: కోహ్లీ
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 8:31 AM

టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగితే తనకు సంతోషమేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌తోనే రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటన ముగిసే వరకు ఆయన పదవీకాల గడువు పెంచింది బీసీసీఐ. తాజాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కోహ్లీ పలు విషయాలపై స్పందించారు.

టీమిండియా హెడ్ కోచ్‌ విషయంపై క్రికెట్ సలహా కమిటీ నన్ను సంప్రదించలేదు. అయితే రవిశాస్త్రితో ఇప్పుడు ఉన్న ఆటగాళ్లందరికీ మంచి బంధం ఉంది. అయితే కోచ్ ఎంపికలో మాత్రం సలహా మండలిదే తుది నిర్ణయం అని కోహ్లీ అన్నాడు. కాగా టీమిండియా కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ తుది తేదీ కాగా.. వారికి ఆగష్టు 13న గానీ, 14న గానీ ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది.

కాగా హెడ్ కోచ్ పదవిని ఆశిస్తూ.. రవిశాస్త్రితో పాటు జయవర్దనె, టామ్ మూడీ, మైక్ హసన్, రాబిన్ సింగ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ సారి రవిశాస్త్రికి గట్టి పోటీ ఉండని వార్తలు వినిపిస్తున్నాయి. అయినా మళ్లీ హెడ్ కోచ్ బాధ్యతలు రవిశాస్త్రికే అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.