లవర్స్ ఇంటర్వ్యూ.. మధ్యలో యువరాజ్ ఏమడిగాడబ్బా.?

సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆన్- ఫీల్డ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించే యువరాజ్.. ఆఫ్ ది ఫీల్డ్‌లో ఆటగాళ్లతో నవ్వుతూ ఆటపట్టిస్తుంటాడు. అప్పుడప్పుడూ ఆటగాళ్లతో ప్రాంక్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు. సరిగ్గా అలాంటి సంఘటన తాజాగా జరుగుతున్న గ్లోబల్ టీ20లో చోటు చేసుకుంది. టొరంటో నేషనల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యువరాజ్.. ఆ జట్టు ఆటగాడు బెన్ కటింగ్‌ను యాంకర్ ఎరిన్ హాలండ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు […]

  • Ravi Kiran
  • Publish Date - 2:38 pm, Tue, 30 July 19
లవర్స్ ఇంటర్వ్యూ.. మధ్యలో యువరాజ్ ఏమడిగాడబ్బా.?

సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆన్- ఫీల్డ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించే యువరాజ్.. ఆఫ్ ది ఫీల్డ్‌లో ఆటగాళ్లతో నవ్వుతూ ఆటపట్టిస్తుంటాడు. అప్పుడప్పుడూ ఆటగాళ్లతో ప్రాంక్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు. సరిగ్గా అలాంటి సంఘటన తాజాగా జరుగుతున్న గ్లోబల్ టీ20లో చోటు చేసుకుంది.

టొరంటో నేషనల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యువరాజ్.. ఆ జట్టు ఆటగాడు బెన్ కటింగ్‌ను యాంకర్ ఎరిన్ హాలండ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పానకంలో పుడకలా మధ్యలో వచ్చి జోకులతో నవ్వులు తెప్పించాడు. దీనిలో ఏముందని అనుకోవద్దు.. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్.. స్వయంగా బెన్ కట్టింగ్ లవర్ కావడం విశేషం. అందుకే యువరాజ్ వచ్చి ‘మీ పెళ్ళెప్పుడు చెప్పండి’ అంటూ అడిగి క్షణాల్లోనే మాయమయ్యాడు. లవర్స్ మొదట ఖంగుతిన్నా.. ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ జోక్ ఆస్వాదించారు. ఇకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యాంకర్ ఎరిన్ హాలండ్ దానిని రీ-ట్వీట్ చేస్తూ.. ‘యువరాజ్.. మా పెళ్ళికి నిన్ను తప్పకుండా పిలుస్తాం’ అని పేర్కొంది.