AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foot Ball: ఫుట్‌బాల్‌ క్రీడలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి.. అత్యంత పిన్నవయస్కురాలిగా..

Guguloth Soumya Selected Indian Football Team: ఫుట్‌బాల్‌ క్రీడ.. అత్యంత ఖరీదైన క్రీడల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉన్న ఫుట్‌బాల్‌లో ఓ తెలుగమ్మాయి రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ప్రకటించిన..

Foot Ball: ఫుట్‌బాల్‌ క్రీడలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి.. అత్యంత పిన్నవయస్కురాలిగా..
Narender Vaitla
|

Updated on: Feb 11, 2021 | 9:13 PM

Share

Guguloth Soumya Selected Indian Football Team: ఫుట్‌బాల్‌ క్రీడ.. అత్యంత ఖరీదైన క్రీడల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉన్న ఫుట్‌బాల్‌లో ఓ తెలుగమ్మాయి రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ప్రకటించిన సీనియర్‌ మహిళల జట్టులో చోటు దక్కించుకున్న ఈ అమ్మాయి దేశం దృష్టిని ఆకర్షించింది. వివారాల్లోకి వెళితే.. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన గూగులోత్‌ సౌమ్య పందొమ్మిదేళ్లకే భారత సీనియర్‌ ఫుట్‌బాల్‌ మహిళల జట్టులో చోటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా సౌమ్య రికార్డు సృష్టించింది. అంతేకాకుండా 30 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత సీనియర్‌ మహిళల జట్టుకు ఎంపికైన ప్లేయర్‌గా సౌమ్య మరో గౌరవాన్ని దక్కించుకుంది. గోవాలో 20 మందితో కూడిన తుది జట్టును ప్రకటించగా అందులో సౌమ్య చోటు దక్కించుకోవడం విశేషం. ఈ నెల 14 నుంచి టర్కీలో జరగనున్న అంతర్జాతీయ ఫుట్‌ బాల్‌ పోటీల్లో సౌమ్య భారత జట్టు తరఫున ఆడనుంది. ఇక సౌమ్య స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలానికి చెందిన కిసాన్‌ నగర్‌ తండా. ప్రస్తుతం సౌమ్మ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. నేపాల్‌లో జరిగిన అండర్‌ 14 ఫుట్‌బాల్‌ పోటీల్లో భారత జట్టు తరఫున తొలిసారి ఆడిన సౌమ్య ఆ తర్వాత పలు మ్యాచ్‌ల్లో తన అసమాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. మరి ఈ తెలుగు తేజం అంతర్జాతీయంగా రాణించాలని మనమంతా కోరుకుందాం.

Also Read: ఆ ప్లేయర్‌ని ఈసారికి విడిచిపెట్టండి.. తమిళనాడు క్రికెట్ సంఘాన్ని కోరిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..