మంత్రి పీఏనంటూ మోసం.. మాజీ రంజీ ఫ్లేయర్ నాగరాజు అరెస్ట్

మంత్రి కేటీఆర్ పీఏ అంటూ మోసాలు చేస్తున్న నాగరాజును సోమవారం సాయంత్రం తెలంగాణ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మంత్రి పీఏనంటూ మోసం.. మాజీ రంజీ ఫ్లేయర్ నాగరాజు అరెస్ట్
Follow us

|

Updated on: Nov 16, 2020 | 8:34 PM

‘నేను మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శిని మాట్లాడుతున్నాను… పేదవాడైన ఒక జూనియర్‌ క్రికెటర్‌కు మీరు సహాయం చేయండి’.. అంటూ బోగస్‌ కాల్‌ చేసి ఓ డ్రగ్స్ ఫార్మా కంపెనీకి టోకరా వేశాడో ప్రబుద్ధుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

మంత్రి కేటీఆర్ పీఏ అంటూ మోసాలు చేస్తున్న నాగరాజును సోమవారం సాయంత్రం తెలంగాణ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇంతకు ముందు కూడా అనేక కేసులు నమోదైయ్యాయి. డ్రగ్స్ ఫార్మా కంపెనీల వద్ద డబ్బు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పొల్యూషన్ బోర్డ్ నోటీసులు ఇవ్వకుండా చూస్తానని రూ.15లక్షలు స్వాహా చేసినట్లు ఇది వరకే కేసు నమోదైంది.

అంతేకాకుండా , నాగరాజుపై గతంలో ఏపీ, తెలంగాణలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఓ ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు గత ఏడాది డిసెంబర్‌ 16న ఫోన్‌కాల్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన బుడుమూరు నాగరాజు అనే రంజీ క్రికెట్‌ ప్లేయర్‌ అండర్‌ 25 ప్రపంచకప్ కు ఎంపికయ్యాడని.. ఆయనకు తక్షణం రూ.3.3 లక్షలు ఆర్థిక సాయమందించాలంటూ సదరు సంస్థకు ఫోన్‌ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్‌ పేరు చెప్పి మోసానికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?