బౌలింగ్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్న అశ్విన్.. వీడియోను ట్వీట్ చేసిన బీసీసీఐ

ఆస్ట్రేలియాతో సిరీస్​ కోసం టీమ్​ఇండియా క్రికెటర్​ కేఎల్​ రాహుల్​, రవిచంద్రన్​ అశ్విన్ కలిసి వినూత్నంగా బౌన్సర్లపై ప్రాక్టీస్​ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్​ చేసింది.

బౌలింగ్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్న అశ్విన్.. వీడియోను ట్వీట్ చేసిన బీసీసీఐ

Innovative Techniques :  ఆస్ట్రేలియాతో సిరీస్​ కోసం టీమ్​ఇండియా క్రికెటర్​ కేఎల్​ రాహుల్​, రవిచంద్రన్​ అశ్విన్ కలిసి వినూత్నంగా బౌన్సర్లపై ప్రాక్టీస్​ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్​ చేసింది.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా క్వారంటైన్​లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు నెట్​ ప్రాక్టీస్​ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ ఎప్పటికప్పుడు ట్విట్టర్​లో పోస్ట్​ చేస్తుంది. తాజాగా కేఎల్​ రాహుల్​, స్టార్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ కలిసి వినూత్నమైన పద్ధతిలో ప్రాక్టీస్​ చేస్తోన్న వీడియోను ట్వీట్​ చేసింది. ఈ కొత్త ప్రయోగం ఎలా ఉంది? అనే కామెంట్‌‌ను  జోడించింది.

ఇందులో  టీమిండియా వికెట్‌కీపర్‌ కేఎల్ రాహుల్ బౌన్సర్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అతడికి స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ సాయం చేస్తున్నాడు. 22 గజాలకు బదులుగా 18 గజాల నుంచి అశ్విన్‌ రాకెట్‌తో టెన్నిస్‌ బంతుల్ని సంధిస్తుండగా వాటిని పుల్‌షాట్స్‌తో రాహుల్ ఎదుర్కొంటున్నాడు.

హార్దిక్‌ పాండ్య పైకి ఎగురుతున్న వీడియోను కూడా బీసీసీఐ ట్విట్టర్‌లో పంచుకుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరగనున్న మొదటి  డే అండ్ నైట్ టెస్టు కోసం షమి గులాబి బంతితో నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. ఎంతో కాలం తర్వాత  టీమిండియాతో కలిసి సాధన చేస్తున్నాను అని ట్వీట్ చేశాడు.


నవంబరు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu