మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్… నేనే గెలిచాను అంటూ పోస్ట్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యూఎస్ అధ్యక్ష ఎన్నికలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.

మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్...  నేనే గెలిచాను అంటూ పోస్ట్..
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 16, 2020 | 9:25 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యూఎస్ అధ్యక్ష ఎన్నికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తానే గెలిచానని ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలవడానికి డెమొక్రాట్లు రిగ్గింగ్‌కు వంటి అక్రమాలకు పాల్పడ్డారని పదే పదే ఆరోపణలు చేస్తున్న ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.

అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నిబంధనల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అధికార బదిలీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. 2021 జనవరి 20 అర్ధరాత్రి లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి వైట్ హౌస్‌ను ఖాళీ చేయాల్సి ఉండగా.. ట్రంప్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. అయితే, రెండు రోజుల కిందట ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అధికార బదిలీ ప్రక్రియపై ఆశలు రేగాయి. అయితే తాజాగా, ఆయన చేసిన ట్వీట్ మరోసారి సందిగ్ధంలో పడేసింది.

ఎన్నికల ఫలితాల అనంతరం అధ్యక్షుడు అధికార బదిలీకి అంగీకరించకపోవడం అమెరికా ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యలతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. పలు చోట్ల చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

డెమొక్రాట్లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. న్యాయ పోరాటం చేస్తానని ట్రంప్ ఇప్పటికే చెబుతున్నారు. పత్రికలను కూడా అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. జో బైడెన్ పేరు ప్రస్తావించకుండానే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అంశాలపై జో బైడెన్ ఆచితూచి స్పందిస్తున్నారు.