సొంత మైదానంలో ధోనీ ఆఖరి వన్డే?

రాంచి: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మార్చి 8వ తేదీన మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరుగుతుంది. ఇందులో ఆడుతున్న ధోనీకిది ఆఖరి వన్డే కావొచ్చని వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఈ మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్ జరగడానికి కనీసం ఏడాదిన్నర్ర పడుతుంది. ఇక్కడ వన్డే జరిగి అందులో ధోనీ ఆడటం కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే టెస్టుల నుంచిరిటైర్ అయిన ధోనీ వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు నుంచి కూడా తప్పుకునే […]

సొంత మైదానంలో ధోనీ ఆఖరి వన్డే?
Vijay K

| Edited By: Ram Naramaneni

Mar 09, 2019 | 12:24 PM

రాంచి: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మార్చి 8వ తేదీన మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరుగుతుంది. ఇందులో ఆడుతున్న ధోనీకిది ఆఖరి వన్డే కావొచ్చని వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఈ మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్ జరగడానికి కనీసం ఏడాదిన్నర్ర పడుతుంది. ఇక్కడ వన్డే జరిగి అందులో ధోనీ ఆడటం కష్టమయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పటికే టెస్టుల నుంచిరిటైర్ అయిన ధోనీ వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు నుంచి కూడా తప్పుకునే ఆలోచనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరి రాంచిలో రేపు ఆస్ట్రేలియాతో భారత్ ఆడనున్న మ్యాచ్‌ ధోనీకి ఆఖరి వన్డే అయ్యే అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ విషయాన్ని నమ్ముతున్న రాంచీ ప్రజలు, తమ అభిమాన ఆటగాడికి సొంత మైదానంలో ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాంచీ మైదానంలో మీడియా, వీఐపీ బాక్స్ లు ఉండే స్టాండ్‌కు ధోనీ పేరు పెట్టాలని నిర్ణయించిన జీఎన్సీఏ, దాన్ని ప్రారంభించాలని ధోనీని కోరగా, తన సొంత ఇంట్లో తాను ఆవిష్కరించేది ఏముంటుందని ఆయన నిరాకరించిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu