ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ నుంచి పీవీ సింధు ఔట్

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాట్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆదిలోనే ఇండియాకు నిరాశ ఎదురైంది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోను టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. కొరియాకు చెందిన క్రీడాకారిణి సంగ్ జి హుయున్ చేతిలో 16-21, 22-20, 18-21 తేడాతో ఓడింది. ఈ ఇద్దరి మధ్య ఆట ఒక గంట 20 నిమిషాల పాటు సాగింది. ముందు బాగా ఆడిన సింధూ తర్వాత వెనకబడింది. ఈ ఇద్దరు ఇప్పటి వరకూ 15 సార్లు తలపడగా […]

ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ నుంచి పీవీ సింధు ఔట్
Vijay K

|

Mar 07, 2019 | 11:04 AM

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాట్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆదిలోనే ఇండియాకు నిరాశ ఎదురైంది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోను టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. కొరియాకు చెందిన క్రీడాకారిణి సంగ్ జి హుయున్ చేతిలో 16-21, 22-20, 18-21 తేడాతో ఓడింది. ఈ ఇద్దరి మధ్య ఆట ఒక గంట 20 నిమిషాల పాటు సాగింది. ముందు బాగా ఆడిన సింధూ తర్వాత వెనకబడింది. ఈ ఇద్దరు ఇప్పటి వరకూ 15 సార్లు తలపడగా సంగ్ గెలవడం ఇది ఏడవసారి.

ఈ గేమ్‌లో సింధూ మొదట లీడ్‌లో నిలచింది. అయితే అకస్మాత్తుగా కొరియన్ క్రీడాకారిణి గేర్ మార్చింది. వరుసగా పాయింట్లు దక్కించుకుంది. దీంతో సింధు తొలి గేమ్‌ను 16-21 తేడాతో గెలుచుకుంది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు 22-20 తేడాతో పైచేయి సాధించింది. కానీ చివరి గేమ్‌లో కొరియన్ క్రీడాకారిణి మళ్లీ గేర్ మార్చి 21-18 తేడాతో నెగ్గింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu