ఇప్పుడు డెలివరీ బాయ్‌గా చేస్తున్నా.. నెదర్లాండ్‌ క్రికెటర్ పాల్‌ ఆవేదన

అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని దేశాలను దెబ్బతీసింది.

ఇప్పుడు డెలివరీ బాయ్‌గా చేస్తున్నా.. నెదర్లాండ్‌ క్రికెటర్ పాల్‌ ఆవేదన
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 16, 2020 | 12:39 PM

Paul van Meekeren: అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని దేశాలను దెబ్బతీసింది. ఇక కరోనా నేపథ్యంలో చాలా క్రీడా టోర్నీలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. వాటిలో పురుషుల టీ20 ప్రపంచకప్ ఒకటి. షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియాలో గత నెల 18 నుంచి నవంబర్ 15 వరకు టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కానీ కరోనాతో ఈ టోర్నీ వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ టీ20ని గుర్తు చేస్తూ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ఆదివారం ఓ ట్వీట్ చేసింది. నిజానికి చెప్పాలంటూ టీ 20 వరల్డ్ కప్‌ మెన్‌ ఫైనల్‌ ఇవాళ జరగాల్సి ఉండేది అని తెలుపుతూ కప్ ఫొటోను షేర్ చేసింది. (ప్రారంభమైన మంచు వర్షం.. ప్రముఖ కేదార్‌నాథ్‌ ఆలయం మూసివేత)

దానికి నెదర్లాండ్ క్రికెటర్ పాల్‌ వన్ మీకెరన్ స్పందిస్తూ.. ”మేము క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ నేను ఇప్పుడు ఊబర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నా. పరిస్థితులు చాలా మారిపోయాయో తలుచుకుంటుంటే నవ్వొస్తోంది. నవ్వుతూ ముందుకు సాగండి” అని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారగా.. ధైర్యం ఉండండి, మిమ్మల్ని త్వరలోనే గ్రౌండ్‌లో చూస్తాము అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ బౌలర్ ఇప్పటివరకు 5 వన్డేలు, 39 టీ20లు ఆడారు. (‘ఛత్రపత్రి’ రీమేక్‌లో బెల్లంకొండ.. దర్శకత్వం వహించనున్న ప్రభాస్ దర్శకుడు..!