Year Ender 2022: ఫార్మాట్ ఏదైనా సరే.. బౌలర్ ఎవరైనా తగ్గేదేలే.. భారీ సిక్సులే టార్గెట్.. లిస్టులో టీమిండియా ప్లేయర్ కూడా..
Most Sixes in 2022: 2022లో ఇప్పటివరకు చాలా మంది ఫాస్ట్ పేస్ బ్యాట్స్‌మెన్‌లు కనిపించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Year Ender 2022: క్రికెట్ ఏ ఫార్మాట్ అయినా, పొడవాటి సిక్సర్లు కొట్టినప్పుడు చూడటం ప్రేక్షకులతోపాటు అభిమానులకు ఆనందంగా ఉంటుంది. టీ20 ఇంటర్నేషనల్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసినా, కొందరు ఆటగాళ్లు టెస్టుల్లో కూడా చాలా దూకుడుగా ఆడుతున్నారు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడిన బ్యాట్స్‌మెన్‌ల గురించి మనం తప్పక తెలుసుకోవాల్సిందే. ఈ ఏడాది టెస్టు, వన్డే, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్స్‌లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
బెన్ స్టోక్స్ (టెస్ట్ క్రికెట్)..
ఇంగ్లిష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ ఏడాది (2022) టెస్ట్ క్రికెట్‌లో చాలా దూకుడు వైఖరిని అవలంబించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో స్టోక్స్ మొత్తం 26 సిక్సర్లు బాదాడు. స్టోక్స్ 15 మ్యాచ్‌ల్లో ఆడిన 26 ఇన్నింగ్స్‌ల్లో ఈ సిక్సర్లు బాదాడు. ఈ ఏడాది మాత్రమే కాకుండా ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా స్టోక్స్ నిలిచాడు. అతను ఇప్పటివరకు టెస్టుల్లో మొత్తం 107 సిక్సర్లు కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ బ్రాండన్ మెక్‌కల్లాంతో సమానంగా నిలిచాడు.
నికోలస్ పూరన్ (వన్డే క్రికెట్)..
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ఈ ఏడాది ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. 2022లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో ఆడిన 21 ఇన్నింగ్స్‌ల్లో 27 సిక్సర్లు కొట్టాడు. నికోలస్ పూరన్ తన ఫాస్ట్ బ్యాటింగ్‌కు పేరుగాంచాడు.
సూర్యకుమార్ యాదవ్ (టీ20 ఇంటర్నేషనల్)..
ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో సూర్యకుమార్ యాదవ్ పేరు మాత్రమే వినిపించింది. సూర్య ఈ సంవత్సరం టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్, టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా నంబర్ వన్, అత్యధిక సిక్సర్లు కొట్టిన పరంగా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అతను ఇప్పటి వరకు 31 మ్యాచ్‌ల్లో ఆడిన 31 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 68 సిక్సర్లు బాదాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..