IND vs NED: రెండో వార్మప్ మ్యాచ్ కూడా వర్షార్పణం.. సన్నాహాలు లేకుండానే ప్రపంచ కప్ బరిలోకి రోహిత్ సేన..
ICC Cricket World Cup 2023 Warm-up Matches 2023: ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న టీమ్ ఇండియా తొలి మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత అక్టోబరు 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. అక్టోబరు 15న పాకిస్థాన్‌తో, 19న పూణెలో బంగ్లాదేశ్, 22న ధర్మశాలలో న్యూజిలాండ్, 29న లక్నోలో ఇంగ్లండ్, నవంబర్ 2న ముంబైలో క్వాలిఫయర్ జట్టు శ్రీలంక, నవంబర్ 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా తలపడనుంది.

ICC Cricket World Cup Warm-up Matches 2023: ప్రపంచకప్-2023 కోసం టీమ్ ఇండియా సన్నాహాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేరళలోని తిరువనంతపురంలో జరగాల్సిన టీమిండియా రెండో వార్మప్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. అంతకుముందు గౌహతిలో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ కూడా రద్దయింది. టీమ్ ఇండియా తన సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశం. కానీ, రెండు వార్మప్ మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ప్రపంచకప్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న టీమ్ ఇండియా తొలి మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత అక్టోబరు 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. అక్టోబరు 15న పాకిస్థాన్‌తో, 19న పూణెలో బంగ్లాదేశ్, 22న ధర్మశాలలో న్యూజిలాండ్, 29న లక్నోలో ఇంగ్లండ్, నవంబర్ 2న ముంబైలో క్వాలిఫయర్ జట్టు శ్రీలంక, నవంబర్ 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా తలపడనుంది. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్ నవంబర్ 11న బెంగుళూరులో క్వాలిఫైయర్ జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
View this post on Instagram
టీం ఇండియా వన్డే ప్రపంచకప్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే..
అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా – చెన్నై
అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ – ఢిల్లీ
అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్ – అహ్మదాబాద్
అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్ – పూణె
అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ – ధర్మశాల
అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ – లక్నో
నవంబర్ 2: భారత్ vs శ్రీలంక – ముంబై
నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా – కోల్‌కతా
నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ – బెంగళూరు.
ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు- రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ జడేజా, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
View this post on Instagram
అశ్విన్‌కు లక్కీ ఛాన్స్..
వన్డే ప్రపంచకప్ జట్టులోకి అశ్విన్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా అక్షర్ పటేల్ ఎంపిక కాగా, ఆసియా కప్‌లో గాయపడ్డాడు. దీంతో ఆ టోర్నీ చివరి మ్యాచ్ ఆడకుండానే తప్పుకున్నాడు. ప్రపంచకప్ జట్టులోకి తిరిగి వస్తాడని అనుకున్నా.. అదీ కుదరలేదు. దీంతో అక్షర్ ప్లేస్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








