India vs England: ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ తో ప్రాక్టీస్ మ్యాచ్.. జట్టు కూర్పుపై అంచనాకు వచ్చేనా?

అస్సాంలోని గౌహతి స్టేడియంలో భారత్‌ ఈరోజు వామప్‌ మ్యాచ్‌ ఆడబోతోంది. డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే గౌహతికి చేరుకున్న రెండు జట్లు నిన్న ప్రాక్టీస్‌ చేశాయి. ఇక భారత జట్టులోకి చివరి నిమిషంలో వచ్చి చేరిన స్పిన్నర్‌ అశ్విన్‌కు మరిన్ని చాన్స్‌లు ఇవ్వనున్నారు. రోహిత్‌, కోహ్లీ, గిల్‌, రాహుల్‌,అయ్యర్‌, హార్దిక్ పాండ్యా రెగ్యులర్‌ టీమ్‌లో ఉండే అవకాశం ఉంది. బౌలర్లలో సిరాజ్‌, బుమ్రాకు చోటు దక్కొచ్చు. అయితే షమీ, శార్ధూల్‌లో పరిస్థితిని బట్టి ఒకరికి అవకాశం వస్తుంది.

India vs England: ప్రపంచకప్‌కు  ముందు ఇంగ్లండ్ తో ప్రాక్టీస్ మ్యాచ్.. జట్టు కూర్పుపై అంచనాకు వచ్చేనా?
India Vs England
Follow us
Basha Shek

|

Updated on: Sep 30, 2023 | 7:49 AM

అస్సాంలోని గౌహతి స్టేడియంలో భారత్‌ ఈరోజు వామప్‌ మ్యాచ్‌ ఆడబోతోంది. డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే గౌహతికి చేరుకున్న రెండు జట్లు నిన్న ప్రాక్టీస్‌ చేశాయి. ఇక భారత జట్టులోకి చివరి నిమిషంలో వచ్చి చేరిన స్పిన్నర్‌ అశ్విన్‌కు మరిన్ని చాన్స్‌లు ఇవ్వనున్నారు. రోహిత్‌, కోహ్లీ, గిల్‌, రాహుల్‌,అయ్యర్‌, హార్దిక్ పాండ్యా రెగ్యులర్‌ టీమ్‌లో ఉండే అవకాశం ఉంది. బౌలర్లలో సిరాజ్‌, బుమ్రాకు చోటు దక్కొచ్చు. అయితే షమీ, శార్ధూల్‌లో పరిస్థితిని బట్టి ఒకరికి అవకాశం వస్తుంది. కుల్దీప్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్‌ వరల్డ్‌కప్‌లోనే వాడుకునే చాన్స్‌ ఉంది. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజాల్లో ఎవరికి ప్లేస్‌ ఉంటుందో చూడాలి. ఇక ఇంగ్లండ్‌ టీమ్‌ ఈసారి కూడా టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బట్లర్‌, స్టోక్స్‌, బ్రూక్‌, రూట్‌, లివింగ్‌స్టోన్‌, అలీ, వుడ్‌ వంటి స్టార్‌ ప్లేయర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఈరోజు వామప్‌ మ్యాచ్‌లో గెలిచి.. వరల్డ్‌ కప్‌ మెయిన్‌ లీగ్‌లోకి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాలని చూస్తోంది భారత్‌. అయితే పిచ్‌ కండిషన్స్‌ను బట్టి జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉంది. అటు టీమ్‌లో చోటు కోల్పోయిన అక్షర్‌ పటేల్‌ తన అసంతృప్తిని సోషల్‌ మీడియాలో వెళ్లగక్కాడు.

ఎవరైనా ఆడొచ్చు..

మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమ్ కూడా ఉంటుంది. ఇది సన్నాహక మ్యాచ్‌ కావడంతో పదకొండు నిబంధన లేదు. జట్టులోని ఏ ఆటగాడైనా బరిలోకి దిగవచ్చు. బ్యాటింగ్‌ ఇన్నింగ్స్‌లో ఆడిన ఆటగాళ్లు బౌలింగ్‌ సమయంలో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి టీం ఇండియా ఆటగాళ్లందరినీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడించగలదు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది.

పిచ్‌ ఎలా ఉందంటే?

గౌహతిలోని బుర్సపరా క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు మరింత బౌన్స్ ఇస్తుంది. ఈ పిచ్‌పై బౌలర్లు సరైన లక్ష్యంతో బౌలింగ్ చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. ముఖ్యంగా మిడిల్ స్టేజ్‌లో ఆట సాగుతున్నప్పుడు పిచ్ స్పిన్నర్లకు సహాయం చేస్తుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమ ఎంపిక.

ఇవి కూడా చదవండి

వాతావరణం ఎలా ఉందంటే?

సెప్టెంబర్ 30న గౌహతిలో ఎక్కువగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. సాయంత్రం వర్షం పడే అవకాశం 70 శాతం. కాబట్టి భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ నుండి 34 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు.

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ బుమ్రా , మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

ఇంగ్లండ్ జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్ , క్రిస్ వోక్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.