IND vs ENG: గౌహతి చేరిన ఇంగ్లండ్ టీం.. అసంతృప్తిని వ్యక్తం చేసిన బెయిర్ స్టో.. కారణం ఏంటో తెలుసా?

ODI World Cup 2023: అక్టోబర్ 5 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చివరిసారి రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అయితే అంతకుముందే ఇంగ్లండ్ ఆటగాళ్ల ఓపిక నశించినట్లు తెలుస్తోంది. భారత్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

IND vs ENG: గౌహతి చేరిన ఇంగ్లండ్ టీం.. అసంతృప్తిని వ్యక్తం చేసిన బెయిర్ స్టో.. కారణం ఏంటో తెలుసా?
Jonny Bairstow
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2023 | 7:15 AM

IND vs ENG: భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) కోసం అన్ని జట్లూ చేరుకోవడం ప్రారంభించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ (England Cricket Team) గురువారం భారత్‌లో అడుగుపెట్టింది. ఆ జట్టు శనివారం గౌహతిలో భారత్‌తో తమ మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు గౌహతి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఓపెనింగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చివరిసారి రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే అంతకుముందే ఇంగ్లండ్ ఆటగాళ్ల ఓపిక నశించినట్లు తెలుస్తోంది. భారత్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

38 గంటల ప్రయాణం..

నిజానికి, ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో అసంతృప్తికి భారత్ కారణం కాదు. దానికి బదులు ఇంగ్లండ్ నుంచి భారత్ కు ప్రయాణమే ఇంగ్లండ్ ఆటగాడి ఆగ్రహానికి కారణంగా మారింది. 38 గంటలకు పైగా సాగిన ఈ ప్రయాణం గురించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విచారం వ్యక్తం చేసిన బెయిర్‌స్టో, ఇది చాలా గందరగోళ ప్రయాణం అంటూ చెప్పుకొచ్చాడు. బెయిర్‌స్టో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విమానం ఫొటోను షేర్ చేశాడు. ఇందులో మార్క్ వుడ్, కెప్టెన్ జోస్ బట్లర్ ఉన్నారు. ఈ ఫొటో చివర బెయిర్‌స్టో, 38 గంటలు గడిచిపోయాయి. అయితే, ప్రయాణం ఇంకా పెండింగ్‌లో ఉందని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

దీని అర్థం ఏమిటంటే, బెయిర్‌స్టో సుదీర్ఘ ప్రయాణంతో చాలా నిరాశ చెందాడు. అదే సమయంలో విమానంలో కొన్ని మిస్ హ్యాండ్లింగ్ ఇంగ్లండ్ జట్టుకు ఇబ్బంది కలిగించినట్లు కనిపిస్తోంది.

వివిధ మైదానాల్లో మ్యాచ్‌లు..

ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఇంగ్లండ్ తన ఎనిమిది మ్యాచ్‌లను వేర్వేరు వేదికల్లో ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ లక్నో, ధర్మశాల, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె, కోల్‌కతాలో మ్యాచ్‌లు ఆడనుంది. దీనికి సంబంధించి జట్టు కోచ్ మాథ్యూ మోట్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు దానికి ఎలా అలవాటు పడతారో తెలియడం లేదంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!