AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ గెలుపు!

లార్డ్స్: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ విజయంతో టోర్నీకి ముగింపు పలికింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. బాబర్ అజాం(96), ఇమామ్(100) రాణించారు. అటు బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీయగా.. సైఫుద్దీన్ 3, మెహిదీ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 44 […]

బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ గెలుపు!
Ravi Kiran
|

Updated on: Jul 05, 2019 | 11:15 PM

Share

లార్డ్స్: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ విజయంతో టోర్నీకి ముగింపు పలికింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. బాబర్ అజాం(96), ఇమామ్(100) రాణించారు. అటు బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీయగా.. సైఫుద్దీన్ 3, మెహిదీ 1 వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 44 ఓవర్లకు 221 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో షకిబుల్(64) ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.