AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: భారత టీ20 ప్రపంచ కప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగు ప్లేయర్లకు చోటు.. ఎవరో తెలుసా?

Women's T20 World Cup 2026 India Squad: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అరుంధతి రెడ్డి, శ్రీ చరణి చోటు దక్కించుకున్నారు. పూర్తి స్క్వాడ్, షెడ్యూల్ ఓసారి చూద్దాం..

Team India: భారత టీ20 ప్రపంచ కప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగు ప్లేయర్లకు చోటు.. ఎవరో తెలుసా?
Telugu Players In Team Indiat20i World Cup 2026 Sqaud
Venkata Chari
|

Updated on: May 02, 2026 | 7:14 PM

Share

Women’s T20 World Cup 2026 India Squad: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన పవర్ ఫుల్ జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లతో పాటు యువ ప్రతిభకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఈసారి ప్రపంచ కప్ జట్టులో ఇద్దరు తెలుగు క్రీడాకారిణులు చోటు సంపాదించుకోవడం గమనార్హం.

టీమ్ ఇండియా స్క్వాడ్:

భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

కెప్టెన్: హర్మన్‌ప్రీత్ కౌర్

వైస్ కెప్టెన్: స్మృతి మంధాన

బ్యాటర్లు: షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి

వికెట్ కీపర్లు: రిచా ఘోష్, యస్తికా భాటియా

ఆల్ రౌండర్లు: దీప్తి శర్మ, శ్రీ చరణి (తెలుగు ప్లేయర్), నందిని శర్మ

బౌలర్లు: రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి (తెలుగు ప్లేయర్), క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

మెరిసిన తెలుగు తేజాలు..

ఈ మెగా టోర్నీకి ఎంపికైన జట్టులో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉండటం తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు గర్వకారణం.

అరుంధతి రెడ్డి: సీనియర్ పేసర్ అరుంధతి రెడ్డి తన నిలకడైన ప్రదర్శనతో మరోసారి ప్రపంచ కప్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీయగల సామర్థ్యం ఆమె సొంతం.

శ్రీ చరణి: యువ ఆల్ రౌండర్ శ్రీ చరణికి ఈ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడం ఒక విశేషం. దేశవాళీ క్రికెట్, రీసెంట్ సిరీస్‌లలో తన ప్రతిభను నిరూపించుకోవడంతో సెలక్టర్లు ఆమెకు మొగ్గు చూపారు.

టోర్నీ షెడ్యూల్, గ్రూపులు: జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత్ గ్రూప్ 1లో ఉంది. మన జట్టుతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఈ గ్రూపులో తలపడనున్నాయి.

భారత్ vs పాకిస్థాన్: జూన్ 14 (ఎడ్జ్‌బాస్టన్)

భారత్ vs నెదర్లాండ్స్: జూన్ 17 (హెడింగ్లీ)

భారత్ vs దక్షిణాఫ్రికా: జూన్ 21 (ఓల్డ్ ట్రాఫోర్డ్)

భారత్ vs బంగ్లాదేశ్: జూన్ 25 (ఓల్డ్ ట్రాఫోర్డ్)

భారత్ vs ఆస్ట్రేలియా: జూన్ 28 (లార్డ్స్)

గతేడాది వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడిన టీమ్ ఇండియా, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో కూడా విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే
పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే