AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: విరాళాలు సేకరించి టీ20 ప్రపంచకప్ కోసం కిట్‌లు కొనుగోలు.. కట్‌చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం..

Vanuatu: ఈ టోర్నీకి రాకముందు వనాటు జట్టుకు సొంత కిట్ కూడా లేదు. అరువుగా తీసుకున్న లేదా విరాళంగా ఇచ్చిన కిట్‌తో ఇప్పటి వరకు ఆడారు. ఈ క్రమంలో ఆపరేషన్స్ మేనేజర్ జమాల్ వీరా, మార్కెటింగ్ మేనేజర్ హెర్మోయిన్ వీరా విరాళాల సేకరించి కిట్ కొనుగోలు చేశారు. దీని కింద మొత్తం 6317 అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు ఐదు లక్షల రూపాయలు సమకూరాయి. వీటి ద్వారా టోర్నీకి సంబంధించి కొత్త కిట్లను కొనుగోలు చేశారు.

T20 World Cup: విరాళాలు సేకరించి టీ20 ప్రపంచకప్ కోసం కిట్‌లు కొనుగోలు.. కట్‌చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం..
Vanuatu Vs Zimbabwe
Venkata Chari
|

Updated on: Apr 27, 2024 | 2:03 PM

Share

Women T20 World Cup 2024 Qualifier: యూఏఈలోని అబుదాబి వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ తొలిరోజే జింబాబ్వేపై వనౌటు జట్టు విజృంభించింది. ఆరు వికెట్ల తేడాతో ఈ విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు మూడు లక్షల మంది జనాభా ఉన్న ఈ దేశం తొలిసారి ప్రపంచకప్ క్వాలిఫైయర్ ఆడుతోంది. అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేను 61 పరుగులకే పరిమితం చేసి నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వనౌటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా చుట్టూ ఉన్న ఒక చిన్న దేశం. ఈ జట్టు మొదటిసారిగా తూర్పు-ఆసియా పసిఫిక్ ప్రాంతం వెలుపల ఆడుతోంది. బంగ్లాదేశ్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్‌నకు క్లెయిమ్ చేస్తోంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వనౌటు జట్టు 30వ స్థానంలో ఉండగా, జింబాబ్వే జట్టు 12వ స్థానంలో ఉంది.

వనౌటు తరపున స్పిన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచి మొత్తం ఏడు వికెట్లు తీయడంతో జింబాబ్వే బ్యాటింగ్ కుప్పకూలింది. ఇందులోభాగంగా నసిమన న్వైకా 13 పరుగులిచ్చి నాలుగు వికెట్లు, వెనెస్సా వీర 14 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశారు. జింబాబ్వే నుంచి కేవలం ముగ్గురు బ్యాటర్స్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. ఓపెనర్ షార్న్ మైయర్స్ అత్యధికంగా 16 పరుగులు చేసింది. నలుగురు బ్యాటర్స్ ఖాతాలు తెరవలేదు. దీనికి సమాధానంగా వనౌటుకు చెందిన నవైకా బ్యాటింగ్‌లోనూ అద్భుతాలు చేసి 21 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. అలాగే, వాలెంటా లాంగియాటు 13 పరుగులు, అల్వినా కార్లోట్ 10 పరుగులు చేశారు. దీంతో జట్టు 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ఇవి కూడా చదవండి

విరాళాలతో కిట్‌లను కొనుగోలు..

ఈ టోర్నీకి రాకముందు వనాటు జట్టుకు సొంత కిట్ కూడా లేదు. అరువుగా తీసుకున్న లేదా విరాళంగా ఇచ్చిన కిట్‌తో ఇప్పటి వరకు ఆడారు. ఈ క్రమంలో ఆపరేషన్స్ మేనేజర్ జమాల్ వీరా, మార్కెటింగ్ మేనేజర్ హెర్మోయిన్ వీరా విరాళాల సేకరించి కిట్ కొనుగోలు చేశారు. దీని కింద మొత్తం 6317 అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు ఐదు లక్షల రూపాయలు సమకూరాయి. వీటి ద్వారా టోర్నీకి సంబంధించి కొత్త కిట్లను కొనుగోలు చేశారు. వనౌటు గత కొన్ని నెలల్లో అద్భుతమైన పనితీరును కనబరిచింది. తనకంటే బలమైన జట్లను ఓడించింది. ఇందులో సెప్టెంబర్‌లో 11వ ర్యాంక్‌లో ఉన్న పాపువా న్యూ గినియా జట్టును కూడా ఓడించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..