IPL 2024: చిన్న పొరపాటుతో రూ. 20లక్షలకు కొన్నారు.. కట్‌చేస్తే.. టీ20లోనే రికార్డ్ విజయంతో హీరోగా మారిన అన్ వాంటెడ్ ప్లేయర్

Shashank Singh, IPL 2024: ఐపీఎల్ 2024 42వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శశాంక్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించేందుకు డగౌట్‌లోనే ప్లాన్ వేసినట్లు వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం శశాంక్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు.

IPL 2024: చిన్న పొరపాటుతో రూ. 20లక్షలకు కొన్నారు.. కట్‌చేస్తే.. టీ20లోనే రికార్డ్ విజయంతో హీరోగా మారిన అన్ వాంటెడ్ ప్లేయర్
Shashank Singh Career
Follow us

|

Updated on: Apr 27, 2024 | 1:41 PM

Kolkata Knight Riders vs Punjab Kings, 42nd Match: ఐపీఎల్ 2024 42వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 48 బంతుల్లో 108 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ జానీ బెయిర్‌స్టో పంజాబ్ కింగ్స్ విజయానికి హీరోగా నిలిచింది. అయితే, అతనికి శశాంక్ సింగ్ నుంచి పూర్తి మద్దతు లభించింది. శశాంక్ సింగ్ కేవలం 28 బంతుల్లో 242.86 స్ట్రైక్ రేట్‌తో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో వరుసగా బౌండరీలు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో శశాంక్ 2 ఫోర్లు, 8 అద్భుతమైన సిక్సర్లు బాదాడు. పంజాబ్ కింగ్స్‌కు శశాంక్ ఎక్స్ ఫ్యాక్టర్ అని నిరూపిస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్ అతనిని కొనుగోలు చేయాలని అనుకోలేదంట. కానీ వేలంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా అతను ప్రస్తుతం PBKSలో భాగమయ్యాడు. శశాంక్ అద్భుత ప్రదర్శన కారణంగా పంజాబ్ కింగ్స్ 262 పరుగుల స్కోరును ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించగలిగింది.

పంజాబ్ డగౌట్‌లోనే విధ్వంసానికి ప్రణాళిక..

శశాంక్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించేందుకు డగౌట్‌లోనే ప్లాన్ వేసినట్లు వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం శశాంక్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. డగౌట్ నుంచి వికెట్‌ను పరిశీలించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. ఈ క్రమంలో పిచ్‌ని అర్థం చేసుకుని, అది మంచి బౌన్స్‌గా ఉందని భావించానని, ఆమేరకు నా ప్లాన్ వేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. సునీల్ నరైన్‌ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడాలని, మిగిలిన బౌలర్లపై దూకుడుగా ఉండాలని నిర్ణయించుకున్నానని శశాంక్ చెప్పాడు. పంజాబ్ కింగ్స్ తరపున బ్యాటింగ్ చేయడానికి, స్వేచ్ఛగా షాట్లు ఆడేందుకు తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

వేరొకరికి బదులుగా లక్కీ ఛాన్స్..

ఐపీఎల్ 2024 వేలంలో పంజాబ్ కింగ్స్ శశాంక్‌ సింగ్‌ను అనుకోకుండా కొనుగోలు చేసింది. వేరొకరికి బదులుగా రూ. 20 లక్షలకు జట్టులో చేర్చుకుంది. ప్రస్తుతం ఈ యంగ్ ప్లేయర్ జట్టును ఆదుకుంటూ.. తనను అనుకోకుండా కొనుగోలు చేసినందుకు తగిన ప్రతిఫలం అందిస్తున్నాడు. 65.7 యావరేజ్‌తో 180పైగా స్ట్రైక్‌రేట్‌తో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 263 పరుగులు చేశాడు. ఇందులో 18 సిక్సులు, 19 ఫోర్లు ఉన్నాయి. కాగా, ఏప్రిల్ 5న గుజరాత్ జెయింట్స్‌పై కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులతో నాటౌట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న శశాంక్.. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 28 బంతుల్లోనే 68 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రస్తుతం పంజాబ్ జట్టుకు హీరోగా మారాడు. ఇదే ప్రదర్శనతో రాణించి, త్వరలోనే టీమిండియాకు అరంగేట్రం చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

ఐపీఎల్ 2024లో శశాంక్ సింగ్ ప్రదర్శన..

మ్యాచ్ బ్యాట్ తేదీ గ్రౌండ్ ఫార్మాట్
PBKS vs KKR 68* 26-ఏప్రిల్-2024 ఈడెన్ గార్డెన్స్ T20
PBKS vs GT 8 21-ఏప్రిల్-2024 ముల్లన్పూర్ T20
PBKS vs MI 41 18-ఏప్రిల్-2024 ముల్లన్పూర్ T20
PBKS vs RR 9 13-ఏప్రిల్-2024 ముల్లన్పూర్ T20
PBKS vs SRH 46* 09-ఏప్రిల్-2024 ముల్లన్పూర్ T20
PBKS vs GT 61* 04-ఏప్రిల్-2024 అహ్మదాబాద్ T20
PBKS vs LSG 9* 30-మార్చి-2024 లక్నో T20
PBKS vs RCB 21* 25-మార్చి-2024 బెంగళూరు T20
PBKS vs DC 0 23-మార్చి-2024 ముల్లన్పూర్ T20

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఇవి..! అలవాటు ఉంటే వెంటనే మానుకోండి
ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఇవి..! అలవాటు ఉంటే వెంటనే మానుకోండి
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగండి.. ఫలితం మీరే చూడండి.!
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగండి.. ఫలితం మీరే చూడండి.!
మనం ధరించే రబ్బర్‌ చెప్పులను ఎలా తయారు చేస్తారో తెలుసా.? వీడియో
మనం ధరించే రబ్బర్‌ చెప్పులను ఎలా తయారు చేస్తారో తెలుసా.? వీడియో
ఎంత చల్లటి కబురు.. ఏపీకి వచ్చే 3 రోజులు వానలే వానలు..
ఎంత చల్లటి కబురు.. ఏపీకి వచ్చే 3 రోజులు వానలే వానలు..
మీరు తినే పన్నీర్‌ అసలైనదేనా..? తెలుసుకోవడం ఎలా..?
మీరు తినే పన్నీర్‌ అసలైనదేనా..? తెలుసుకోవడం ఎలా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
విమానంలో సీటు కోసం ముష్టి యుద్ధంచేసిన ప్యాసింజర్లు..చూస్తేఅవాక్కే
విమానంలో సీటు కోసం ముష్టి యుద్ధంచేసిన ప్యాసింజర్లు..చూస్తేఅవాక్కే
చిన్న డ్రస్‌లో పెద్ద పాప.. అదరగొట్టిన ప్రియా ప్రకాష్
చిన్న డ్రస్‌లో పెద్ద పాప.. అదరగొట్టిన ప్రియా ప్రకాష్
నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు
నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ