మా టార్గెట్ 500 రన్స్: పాక్ కెప్టెన్

వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్‌ సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కడా లేవు. అలా జరగాలంటే పాక్ మొదట టాస్ గెలిచి.. కనీసం 450పరుగులు చేసి.. ఆ తరువాత 316పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలి. ఇదిలా ఉంటే అద్భుతం ఎప్పుడైనా జరగొచ్చని, అలాగే ఈ మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా బంగ్లాదేశ్ […]

మా టార్గెట్ 500 రన్స్: పాక్ కెప్టెన్
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 2:23 PM

వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్‌ సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కడా లేవు. అలా జరగాలంటే పాక్ మొదట టాస్ గెలిచి.. కనీసం 450పరుగులు చేసి.. ఆ తరువాత 316పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలి. ఇదిలా ఉంటే అద్భుతం ఎప్పుడైనా జరగొచ్చని, అలాగే ఈ మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా బంగ్లాదేశ్ మీద 500 పరుగులు చేయాలనుకుంటున్నాం అని అతడు ధీమాను వ్యక్తం చేశాడు. మరి ఆ అద్భుతం జరుగుతుందో లేదో తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. కాగా వన్డే చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ 481. అది ఆస్ట్రేలియా మీద ఇంగ్లండ్ చేసింది. ఇప్పటివరకు ఆ స్కోర్‌ను ఏ టీమ్ అధిగమించలేదు. ఒకవేళ సర్ఫరాజ్ చెప్పిందే నిజమైతే అదో కొత్త చరిత్రనే.