ధోని..నీలాంటోడ్నే ఇచ్చి రిటైరవ్వు: మలింగ

భారత సీనియర్ క్రికెటర్ ధోనీ ఆటతీరుపై ప్రస్తుత వరల్డ్ కప్‌లో విమర్శలు వ్యక్తం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ‘తలా’ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు గత నాలుగు రోజుల నుంచి మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ ఆడే చివరి మ్యాచ్ ధోనికి ఆఖరిది అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచార హోరు ఉదృతంగా సాగుతోంది. కానీ ఈ విషయంలో ధోని ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని […]

ధోని..నీలాంటోడ్నే ఇచ్చి రిటైరవ్వు: మలింగ
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 05, 2019 | 2:57 PM

భారత సీనియర్ క్రికెటర్ ధోనీ ఆటతీరుపై ప్రస్తుత వరల్డ్ కప్‌లో విమర్శలు వ్యక్తం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ‘తలా’ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు గత నాలుగు రోజుల నుంచి మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ ఆడే చివరి మ్యాచ్ ధోనికి ఆఖరిది అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచార హోరు ఉదృతంగా సాగుతోంది. కానీ ఈ విషయంలో ధోని ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని లాంటి కీపర్‌..ఒత్తిడి సమయంలో జట్టును ముందుండి నడిపించే సీనియర్ ఆటగాడు ప్రస్తుత యువ జట్టుకు అవసరమని చెప్తున్నారు. పలు చారీత్రాత్మక టోర్నీలను అందించి మాజీ భారత కెప్టెన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌ ప్రచారంపై తాజాగా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ మాట్లాడుతూ ‘ధోనీ కనీసం ఏడాది లేదా రెండేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగాలి. అదే సమయంలో.. టీమ్‌లో ఒక ఫినిషర్‌ని కూడా అతను సిద్ధం చేయాలి. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో ధోనీనే అత్యుత్తమ ఫినిషర్. అందుకే.. టీమ్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. యువ ఆటగాళ్లు ధోనీ నుంచి ఆ ఫినిషింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి’ అని సూచించాడు.