AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs KKR: సొంతగడ్డపై తెలుగబ్బాయ్‌కి షాకిచ్చిన సన్‌రైజర్స్..  ఎందుకో తెలుసా?

Nitish Reddy Injury Update: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు షాక్ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం లేదు. అసలు నితీష్ ఎందుకు ఆడటం లేదు? అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఆటగాడు ఎవరు? పూర్తి వివరాలు మీకోసం.

SRH vs KKR: సొంతగడ్డపై తెలుగబ్బాయ్‌కి షాకిచ్చిన సన్‌రైజర్స్..  ఎందుకో తెలుసా?
Nitish Kumar Reddy Ipl 2026
Venkata Chari
|

Updated on: May 03, 2026 | 4:11 PM

Share

Nitish Reddy Injury Update: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సొంత మైదానంలో భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతో కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, తుది జట్టును ప్రకటించే సమయంలో కీలక ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి జట్టులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

నితీష్ రెడ్డి ఎందుకు ఆడటం లేదు?

టాస్ అనంతరం పాట్ కమిన్స్ మాట్లాడుతూ, నితీష్ రెడ్డి జట్టులో లేకపోవడానికి గల కారణాన్ని స్పష్టం చేశాడు. నితీష్ రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో (Illness) బాధపడుతున్నాడని, అందుకే ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని కమిన్స్ వెల్లడించాడు. “నితీష్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో స్మరణ్ రవిచంద్రన్ జట్టులోకి వచ్చాడు. అలాగే హర్షల్ పటేల్ కూడా తిరిగి తుది జట్టులోకి చేరాడు” అని కమిన్స్ పేర్కొన్నాడు. జట్టులో చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ, తమ దూకుడుగా ఆడే శైలిని కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2026లో నితీష్ రెడ్డి జోరు..

గత సీజన్ (2025)లో నితీష్ రెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అప్పుడు కేవలం 22.75 సగటుతో 182 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, 2026 సీజన్‌లో మాత్రం నితీష్ సరికొత్తగా పుంజుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 193 పరుగులు చేసిన నితీష్, 160.83 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అందించిన శుభారంభాలను నితీష్ మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి భారీ స్కోర్లుగా మలుస్తున్నాడు. బౌలింగ్‌లోనూ 9 ఇన్నింగ్స్‌ల్లో 6 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న ప్లేయర్ దూరం కావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు పెద్ద లోటే అని చెప్పాలి.

అరంగేట్రం చేస్తున్న స్మరణ్ రవిచంద్రన్..

నితీష్ రెడ్డి స్థానంలో జట్టులోకి వచ్చిన స్మరణ్ రవిచంద్రన్ మంచి రికార్డు ఉన్న ఆటగాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన స్మరణ్, ఇప్పటివరకు ఆడిన 13 టీ20 మ్యాచ్‌ల్లో 48.9 సగటుతో 489 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ (162.5) కూడా అద్భుతంగా ఉంది. ఇన్నింగ్స్‌ను నిర్మించడంతో పాటు అవసరమైనప్పుడు గేర్లు మార్చి భారీ షాట్లు ఆడగల సామర్థ్యం స్మరణ్‌కు ఉంది. నితీష్ లేని లోటును ఇతను భర్తీ చేస్తాడని మేనేజ్మెంట్ ఆశిస్తోంది.

ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు (Playing XI)..

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఈషన్ మలింగ, శివాంగ్ కుమార్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ హుస్సేన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us