AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంట్లోని బాత్‌రూమ్‌ నుండి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని డోర్ ఓపెన్ చేయగా..

మార్కాపురంజిల్లా యర్రగొండపాలెంలోని కొండారెడ్డి కాలనీలో రమణమూర్తి వ్యక్తికి ఊహించని పరిణామాం ఎదురైంది. అతని ఇంట్లో ఉన్న బాత్‌రూమ్‌లో నుంచి ఏవో వింత శబ్ధాలు రావడంతో ఏంటాని డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ అతని ఓ పాము కనిపించింది. దాన్ని చూసి భయంతో వణికిపోయిన ఆ వ్యక్తి స్థానికుల సహాయంతో దాన్ని కొట్టి చంపేశాడు.

Viral Video: ఇంట్లోని బాత్‌రూమ్‌ నుండి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని డోర్ ఓపెన్ చేయగా..
Yerragondapalem Snake
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 12:45 PM

Share

ఇంట్లో ఉన్న బాత్‌రూమ్‌లోకి కనిపించిన ఘటన మార్కాపురం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. యర్రగొండపాలెంలోని కొండారెడ్డి కాలనీలో రమణమూర్తి అనే వ్యక్తి ఫ్యామిలీతో పాటు నివసిస్తున్నాడు. అయితే మంగళవారం సాయంత్రం అతనికి ఇంట్లోని బాత్‌రూమ్‌లోంచి ఏవో వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో ఇంతకూ బాత్‌రూమ్‌లో ఏముందని అతను డోర్ ఓపెన్ చేసి చూశాడు. అక్కడ అతనికి దిమ్మతిరిగే సీన్‌ కనిపించింది. బాత్రూమ్‌లోని నీటి బక్కెట్‌పై ఎంచక్కా సేద తీరుతూ ఓ సన్నటిపాము కనిపించింది. ముదురు గోధుమ రంగుతో సన్నగా పొడవుగా ఉన్న పాము ఎండవేడికి తట్టుకోలేక బాత్రూమ్‌లోని నీటితో నిండి ఉన్న బక్కెట్‌పై పారాడుతోంది.

అంతే ఆ పాము చూసిన రమణమూర్తి ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశాడు. వెంటనే ఈ విషయాన్ని స్థానికులతో పాటు ఫారెస్ట్ సిబ్బందికి తెలియజేశాడు. అయితే తమ దగ్గర స్నేక్ క్యాచర్ లేడని మార్కాపురం నుండి పిలిపిస్తామని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో.. ఆ పాము ఇంట్లోకి ఎక్కడ వస్తుందోనని బయటపడిపోయిన రమణమూర్తి స్థానికుల సహాయంతో ఆ పామును కొట్టి చంపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఆమరింది.

అయితే యర్రగొండపాలెం ఫారెస్ట్ కార్యాలయంలో గతంలో స్నేక్ క్యాచర్ ఉండేవాడు. జనావాసాల్లోకి వచ్చిన పాముల గురించి సమాచారం ఇచ్చిన వెంటనే అతను వచ్చి పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలి వేసేవాడు. అయితే బడ్జెట్ లేదనే కారణంతో ఇటీవల స్నేక్ క్యాచర్‌ను తొలగించడంతో పాముల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్నేక్ క్యాచర్ అవసరాన్ని గుర్తించి వెంటనే నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అసలేం పాము ఇది..

రమణమూర్తి ఇంట్లో దూరి సన్నటి పాము బ్రోంజ్‌బ్యాక్ జాతికి చెందింది. వీటి వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే వీటికి అసలు విషమే ఉండదు. దీని శరీరం సన్నగా, పొడవుగా ఉండి, వీపుపై కంచు రంగుతో ఉంటుంది. గోధుమ రంగు చారలు ఉంటాయి. ఇవి చెట్లు, పొదలు, ఇళ్ళ పరిసరాల్లో ఎక్కవగా సంచరిస్తూ బల్లులు, కప్పలను ఆహారంగా తీసుకుంటుంటాయి. ఇవి చాలా వేగంగా కదులుతూ, ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎగురుతూ ప్రయాణిస్తుంటాయి.

ఇవి రాత్రిళ్ళు అస్సలు బయటకు రావు. పగటిపూట ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని చూసిన వెంటనే చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. అయితే యర్రగొండపాలెం ఘటనలో అటవీశాఖ కార్యాలయంలో స్నేక్‌ క్యాచర్‌ లేకపోవడతో స్థానికులు పామును పట్టుకుని కొట్టి చంపేయడం విచారకరం.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us