AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా ప్రపంచకప్ కప్ గెలవడం పక్కా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జింబాబ్వే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే

Australia vs Zimbabwe Match Result: జింబాబ్వే విజయం భారత జట్టుకు శుభశకునమని నెటిజన్లు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే సెంటిమెంట్ నిజమైతే, 2026లో భారత గడ్డపై మరోసారి ప్రపంచ కప్ సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం ఖాయయని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

టీమిండియా ప్రపంచకప్ కప్ గెలవడం పక్కా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జింబాబ్వే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే
Aus Vs Zim Team India LuckImage Credit source: X
Venkata Chari
|

Updated on: Feb 13, 2026 | 5:39 PM

Share

T20I World Cup 2026: ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026 జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా అండర్ డాగ్స్ గా బరిలోకి దిన జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చిన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందనే ఓ సంకేతం కూడా అందించింది. క్రికెట్ ప్రపంచంలో గణాంకాల కంటే అప్పుడప్పుడు ‘సెంటిమెంట్లు’ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇదే క్రమంలో నిన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ స్టంప్ కూడా ఇదే కోవకు వచ్చింది. టీమిండియా కెప్టెన్ స్టంప్ ఔట్ అయినప్పుడల్లా టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ ఆడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వింత కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది.

ఐసీసీ టోర్నమెంట్‌లలో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించిన ప్రతిసారీ, భారత జట్టు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. కానీ, ఇప్పటికే ఇలా జరిగింది. ఇప్పుడు 2026లో కూడా జింబాబ్వే ఆసీస్‌పై విజయం సాధించడంతో, “హిస్టరీ రిపీట్ అవుతుందా?” అని భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Video: వామ్మో.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే మరో బెస్ట్ క్యాచ్.. ఆస్ట్రేలియానే ‘కంగారు’ పెట్టించిన వీడియో

గత రికార్డులు ఏం చెబుతున్నాయి?

గత చరిత్రలో జింబాబ్వే, ఆస్ట్రేలియా మ్యాచ్ లను ఒకసారి పరిశీలిస్తే, ఈ వింత యాదృచ్చికం ఏంటో వివరంగా తెలుస్తుంది.

1983 – సంచలనం: 1983 వన్డే వరల్డ్ కప్‌లో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను 13 పరుగుల తేడాతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే ఏడాది కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ గెలిచింది.

ఇది కూడా చదవండి: AUS Vs ZIM: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ‘బ్లెస్సింగ్’.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్ ఎలైట్ జాబితాలో ఎంట్రీ..

2007 – టీ20 మ్యాజిక్: 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మరోసారి ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఫలితం ఏంటో ఇప్పటి అర్థమైందనుకుంటా. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.

2026 – చరిత్ర రిపీల్ అవుతుందా?: ఇప్పుడు 2026లో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి మరో సంచలనం సృష్టించింది. దీంతో 1983, 2007 సెంటిమెంట్ రిపీట్ అవుంతుందా, భారత్ ఈసారి కూడా వరల్డ్ కప్ గెలుస్తుందా అని ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు.

ఈ సెంటిమెంట్ నిజమయ్యేనా..?

క్రికెట్ అనేది మైదానంలో ఆడే ఆట అయినప్పటికీ, ఇలాంటి గణాంకాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

బలమైన టీమిండియా: ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

అదృష్టం: క్రీడల్లో అప్పుడప్పుడు అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. 1983, 2007 విజయాలు భారత క్రికెట్ చరిత్రను మార్చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీ తాట తీసేందుకు
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీ తాట తీసేందుకు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..