VVS Laxman: నా పార్ట్‌నర్‌పై నాకు పూర్తి నమ్మకముంది.. కోచ్‌గా ద్రవిడ్ ఎంపికపై లక్ష్మణ్ ట్వీట్..
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈమేరకు బుధవారం సాయంత్రం బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది..

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈమేరకు బుధవారం సాయంత్రం బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌తో రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది. టీ 20 వరల్డ్ కప్ ముగిసిన భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో టీ20లు, టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌తోనే తన కోచింగ్ బాధ్యతలను తీసుకుంటున్నారు ద్రవిడ్. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
గతంలో అండర్-19 జట్టుకు కోచ్‌గా ఎందరో ప్రతిభావంతమైన యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చారు రాహుల్. ఈ నేపథ్యంలో ఆయన భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికవ్వడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు మరిన్ని గొప్ప విజయాలు అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా ద్రవిడ్‌కు అభినందనలు తెలిపాడు. ‘హెడ్ కోచ్ పదవికి రాహుల్ సరైన ఎంపిక. అతను భారత్ క్రికెట్‌కు ఓ సేవకుడిలా పనిచేస్తున్నాడు. ఇప్పుడు హెడ్ కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ద్రవిడ్ భారత జట్టును మరింత ముందుకు తీసుకెళ్లతాడన్న నమ్మకం నాకుంది. ఈ కొత్త బాధ్యతల్లో అతను విజయవంతమవ్వాలని కోరుకుంటున్నాను. నా పార్ట్‌నర్‌కు ప్రత్యేక అభినందనలు’ అని అభినందించాడు. ద్రవిడ్- లక్ష్మణ్‌ల జోడి గతంలో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన సంగతి తెలిసిందే.
Also Read:




