India T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ ఆశలు ఇంకా సజీవం.. అయితే ఇలా జరిగితేనే అది సాధ్యం..
India T20 World Cup: దుబాయ్ వేదికగా జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్‌లో భారత పేలవ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై వరుస పరాజయంతో...

India T20 World Cup: దుబాయ్ వేదికగా జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్‌లో భారత పేలవ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై వరుస పరాజయంతో టీమిండియా కూడా నిరాశకు గురైంది. అయితే రెండు వరుస పరాజయల తర్వాత తాజాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆఘ్గనిస్తాన్‌పై ఇండియా భారీ విజయాన్నినమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 210 పరుగులు చేసి.. అఫ్గాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితం చేసింది. దీంతో ఈ భారీ విజయంతో భారత్ రన్‌రేట్ నెగెటివ్ నుంచి పాజిటివ్‌కు చేరుకుంది. ప్రస్తుతం భారత రన్‌రేటు +0.073 చేరుకుంది. దీంతో సెమీఫైనల్‌పై భారత్‌కు ఆశలు చిగురించాయి.
భారత్ సెమీస్‌లోకి వెళ్లాలంటే..
టీమిండియా ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి స్కాట్‌లాండ్ కాగా మరొకటి నమీబియా. బుధవారం ఆఫ్గనిస్తాన్‌పై విజయాన్ని సాధించినట్లే భారీ విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లను భారత్ కనీసం 80 పరుగల తేడాతో ఓడిస్తే సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఇక న్యూజిలాండ్ ఓటమి కూడా భారత్ సెమీస్ ఆశలను నిర్ణయించనుంది. న్యూజిలాండ్, ఆప్గానిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 53 పరగుల తేడాతో ఓడిస్తే భారత్ సెమీస్‌లోకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే న్యూజిలాండ్ గెలిస్తే.. కివీస్ సెమీఫైనల్‌కు చేరుతుంది. ఎలా చూసుకున్నా భారత్ సెమీస్‌లో ప్రవేశించాలంటే టీమిండియాకు అదృష్టం కూడా తోడవ్వాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే ఆఫ్గనిస్తాన్‌పై భారత జట్టు కనబరిచిన ఆటతీరు టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగానే ఉండనున్నాయనే ఆశలకు బలం చేకూరుతున్నాయి. ఓపెనర్‌లు రాణించడంతో భారీగా స్కోరు నమోదైంది. దీంతో రానున్న రోజుల్లోనూ వీరి ఫామ్ ఇలాగే కొనసాగితే భారత్ సెమీస్‌లోకి వెళ్లే అవకాశాలు మెండుగాఉండనున్నాయి.
Jai Bhim Review: ప్రశ్నించే గళం ఉంటే… ఫలితం తప్పకుండా ఉంటుందనే `జై భీమ్`




