IND vs AFG Match Result: టీమిండియా ఘన విజయం.. అర్థ సెంచరీలతో రాణించిన రోహిత్, రాహుల్.. 66 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఓటమి

ఆఫ్ఘనిస్తాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధిచింది.

IND vs AFG Match Result: టీమిండియా ఘన విజయం.. అర్థ సెంచరీలతో రాణించిన రోహిత్, రాహుల్.. 66 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఓటమి
T20 World Cup India
Follow us
Venkata Chari

|

Updated on: Nov 03, 2021 | 11:22 PM

ICC T20 World Cup 2021, IND vs AFG: టీ20 ప్రపంచ కప్ 2021 (ICC T20 World Cup 2021), ఈరోజు రెండవ మ్యాచ్‌లో భాగంగా అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan) మ్యాచ్ జరిగింది. ముచ్చటగా కోహ్లీసేన టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధిచింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ టీం తడబడింది. భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధిచింది.

సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉండడంతో ఆఫ్ఘన్ బాట్స్‌మెన్లు భారీ షాట్లు ఆడేక్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయారు. హజ్రతుల్లా జజాయ్ 13, మహ్మద్ షాజాద్ 0, రహ్మానుల్లా గుర్బాజ్19, గుల్బాదిన్ నాయబ్ 18, నజీబుల్లా జద్రాన్ 11, మహ్మద్ నబీ 35, కరీం జనత్ 42 నాటౌట్, షరాఫుద్దీన్ అష్రఫ్ 2 నాటౌట్, రషీద్ ఖాన్ 0 పరుగులతో నిలిచారు. పవర్ ప్లేలోనే దాదాపు మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. అక్కడి నుంచి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.ఇక టీమిండియా బౌలర్లలో షమీ 3, అశ్విన్ 2, జడేజా, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.

సూపర్-12 గ్రూప్-2లోని ఈ మ్యాచ్ టీమ్ ఇండియా ఆశలకు చిట్టచివరి ఆశగా మిగలడంతో ఈ మ్యాచులో ధీటుగా ఆడాలని ప్లేయర్లు అనుకున్నట్లుగానే భారత ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. డూ ఆర్ డై మ్యాచులో ఓపెనర్లు రోహిత్ శర్మ 74(47 బంతులు, 8 ఫోర్లు, 3సిక్స్‌లు), కేఎల్ రాహుల్ 69(48 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ కలిసి 140 పరుగుల భాగస్వామ్యం అందించారు. దీంతో భారత్‌కు ఓపెనర్ల నుంచి ఆశించిన భారీ ఇన్నింగ్స్‌ లభించింది. అయితే 140 పరుగుల వద్ద రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి కరీం జనత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం వెంటనే 147 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ కూడా గుల్‌బదీన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

అనంతరం రిషబ్ పంత్ 27(13 బంతులు, 1 ఫోర్, 3 సిక్సులు), హర్దిక్ పాండ్యా 35(13 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) క్రీజులోకి వచ్చి ధనాధన్ బ్యాటింగ్ చేసి, అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్ టీ20 ప్రపంచకప్‌లోనే తొలి సారి 200 మార్క్‌ను దాటిన టీంగా రికార్డులు సాధిచింది.

Also Read: T20 World Cup 2021: టోర్నీ నుంచి టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ ఔట్.. ఎందుకో తెలుసా?

T20 World Cup 2021, IND vs AFG: మొదట్లో రోహిత్, రాహుల్.. చివర్లో పంత్, హార్దిక్ జోడీ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం

మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం