- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2021: Team India Bowler varun Chakravarthy out with left calf muscle injury says BCCI
T20 World Cup 2021: టోర్నీ నుంచి టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ ఔట్.. ఎందుకో తెలుసా?
టీ20 ప్రపంచ కప్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల ప్లేయింగ్ XIలో ఆడాడు. అయితే ప్రస్తుతం అతను టోర్నీకి దూరమయ్యే ప్రమాదం నెలకొంది.
Updated on: Nov 03, 2021 | 10:24 PM

గాయాలతో సతమతమవుతున్న భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బుధవారం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసీసీఐ) 'వరుణ్ చక్రవర్తి ఎడమ కాలిపై గాయం ఉంది. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ XIలో ఆడడు' అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది.

టీ20 ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన చక్రవర్తి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతను గాయపడకపోయినా, అతనిని ఎదుర్కోవడంలో పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌లు ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోనందున అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం లేదు. అయితే గాయం కారణంగా అతను మొత్తం టోర్నీకి దూరమయ్యే ప్రమాదం ఉంది.

వరుణ్ చక్రవర్తి రెండు మ్యాచ్‌ల్లోనూ వికెట్లు తీయలేకపోయాడు. పాకిస్థాన్‌పై నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. అదే సమయంలో, న్యూజిలాండ్‌పై 23 పరుగులు ఇచ్చాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడికి మళ్లీ అవకాశం ఇవ్వాలన్న నిర్ణయాన్ని అభిమానుల నుంచి అనుభవజ్ఞుల వరకు వ్యతిరేకించారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జూన్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్.. ఎట్టకేలకు నాలుగైదు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత అశ్విన్ పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడుతున్నారు. అతను 2017లో వెస్టిండీస్‌తో భారత్ తరఫున చివరి పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడాడు.





























