T20 World Cup 2021, IND vs AFG: మొదట్లో రోహిత్, రాహుల్.. చివర్లో పంత్, హార్దిక్ జోడీ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం

టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

T20 World Cup 2021, IND vs AFG: మొదట్లో రోహిత్, రాహుల్.. చివర్లో పంత్, హార్దిక్ జోడీ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం
Ind Vs Afg, Live Score, T20 World Cup 2021 Rohit And Rahul
Follow us

|

Updated on: Nov 03, 2021 | 9:33 PM

ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ 2021 (ICC T20 World Cup 2021), ఈరోజు రెండవ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan) మధ్య జరుగుతోంది. ముచ్చటగా కోహ్లీసేన టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధిచింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

సూపర్-12 గ్రూప్-2లోని ఈ మ్యాచ్ టీమ్ ఇండియా ఆశలకు చిట్టచివరి ఆశగా మిగలడంతో ఈ మ్యాచులో ధీటుగా ఆడాలని ప్లేయర్లు అనుకున్నట్లుగానే భారత ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. డూ ఆర్ డై మ్యాచులో ఓపెనర్లు రోహిత్ శర్మ 74(47 బంతులు, 8 ఫోర్లు, 3సిక్స్‌లు), కేఎల్ రాహుల్ 69(48 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ కలిసి 140 పరుగుల భాగస్వామ్యం అందించారు. దీంతో భారత్‌కు ఓపెనర్ల నుంచి ఆశించిన భారీ ఇన్నింగ్స్‌ లభించింది. అయితే 140 పరుగుల వద్ద రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి కరీం జనత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం వెంటనే 147 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ కూడా గుల్‌బదీన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

అనంతరం రిషబ్ పంత్ 27(13 బంతులు, 1 ఫోర్, 3 సిక్సులు), హర్దిక్ పాండ్యా 35(13 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) క్రీజులోకి వచ్చి ధనాధన్ బ్యాటింగ్ చేసి, అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్ టీ20 ప్రపంచకప్‌లోనే తొలి సారి 200 మార్క్‌ను దాటిన టీంగా రికార్డులు సాధిచింది.

టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ తరఫున అత్యధిక స్కోర్లు 218/4 v Eng డర్బన్ 2007 210/2 v Afg అబుదాబి 2021* 192/2 v WI ముంబై 2016 188/5 v Aus డర్బన్ 2007 186/5 v SA గ్రాస్ ఐలెట్ 2010

T20 ప్రపంచకప్ 2021లో అత్యధిక స్కోర్లు 210/2* Ind v Afg అబుదాబి 190/4 Afg v Sco షార్జా 189/2 Pak v Nam అబుదాబి 181/7 Ban v PNG అల్ అమెరత్

విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు తమ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానానికి చేరుకోవడానికి చివరి మూడు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:  ICC T20 World Cup 2021: డూఆర్ డై మ్యాచులో దంచి కొట్టిన ఓపెనర్లు.. సెంచరీ భాగస్వామ్యంతో హోప్స్ పెంచిన రోహిత్, రాహుల్

T20 World Cup 2021, IND vs AFG: డూ ఆర్ డై మ్యాచులో అశ్విన్‌కు అవకాశం.. 1577 రోజుల తర్వాత వచ్చిన ఛాన్స్..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు