ICC T20 World Cup 2021: డూఆర్ డై మ్యాచులో దంచి కొట్టిన ఓపెనర్లు.. సెంచరీ భాగస్వామ్యంతో హోప్స్ పెంచిన రోహిత్, రాహుల్

డూ ఆర్ డై మ్యాచులో ఓపెనర్లు రోహిత్ శర్మ58(39 బంతులు, 8 ఫోర్లు, 1సిక్స్), కేఎల్ రాహుల్48(34 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించి నాటౌట్‌గా నిలిచారు.

ICC T20 World Cup 2021: డూఆర్ డై మ్యాచులో దంచి కొట్టిన ఓపెనర్లు.. సెంచరీ భాగస్వామ్యంతో హోప్స్ పెంచిన రోహిత్, రాహుల్
Ind Vs Afg, Live Score, T20 World Cup 2021
Follow us
Venkata Chari

|

Updated on: Nov 03, 2021 | 8:48 PM

ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ 2021 (ICC T20 World Cup 2021), ఈరోజు రెండవ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan) మధ్య జరుగుతోంది. సూపర్-12 గ్రూప్-2లోని ఈ మ్యాచ్ టీమ్ ఇండియా ఆశలకు చిట్టచివరి ఆశగా మిగలడంతో ఈ మ్యాచులో ధీటుగా ఆడాలని ప్లేయర్లు అనుకున్నట్లుగానే భారత ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. డూ ఆర్ డై మ్యాచులో ఓపెనర్లు రోహిత్ శర్మ58(39 బంతులు, 8 ఫోర్లు, 1సిక్స్), కేఎల్ రాహుల్48(34 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. విలువై న భాగస్వామ్యం అందించారు. కడపటి వార్తలు అందేసరికి టీమిండియా 12 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్ట పోకుండా 107 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు తమ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానానికి చేరుకోవడానికి చివరి మూడు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు 5 బాబర్ – రిజ్వాన్ 4 రోహిత్ – ధావన్ 4 గప్టిల్ – విలియమ్సన్ 4 రోహిత్ – రాహుల్ T20I లలో 12 సెంచరీ భాగస్వామ్యాలతో జతకట్టాడు. బాబర్ ఆజం కూడా 12 సెంచరీలలో తన భాగస్వామ్యాన్ని అందించాడు.

Also Read: T20 World Cup 2021, IND vs AFG: డూ ఆర్ డై మ్యాచులో అశ్విన్‌కు అవకాశం.. 1577 రోజుల తర్వాత వచ్చిన ఛాన్స్..!

IND vs AFG, Live Score, T20 World Cup 2021: అర్థశతకాలతో దూసుకెళ్తున్న భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్