Fastest Triple Century: 42 ఫోర్లు, 5 సిక్సర్లు.. అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ.. ఎవరు చేశారో తెలుసా?

Fastest Triple Century: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఒకటి చెన్నైలో జరిగింది. 2008లో, దక్షిణాఫ్రికాపై, టీమిండియా మాజీ డేజంరస్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బౌలర్లపై కనికరం చూపకుండా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇది ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డుగా మారింది.

Fastest Triple Century: 42 ఫోర్లు, 5 సిక్సర్లు.. అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ.. ఎవరు చేశారో తెలుసా?
Team India
Follow us
Venkata Chari

| Edited By: TV9 Telugu

Updated on: Dec 05, 2024 | 6:05 PM

Fastest Triple Century: అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ గురించి మాట్లాడితే, అది రెడ్ బాల్ ఫార్మాట్‌లో మాత్రమే వచ్చింది. వన్డేలు, టీ20ల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఘనత ఇప్పటి వరకు ఎవరూ సాధించలేకపోయారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌లో కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయి. బ్రాడ్‌మన్‌-సెహ్వాగ్‌ నుంచి లారా-గేల్‌తో సహా బ్యాట్స్‌మెన్‌లు 32 సార్లు ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనతను సాధించారు. అయితే, వేగంగా 300 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ పేరు మీకు తెలుసా? 16 ఏళ్ల క్రితం 2008లో చేసిన ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

బ్రాడ్‌మన్ నుంచి సెహ్వాగ్, గేల్, లారా వరకు..

చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్స్ ట్రిపుల్ సెంచరీలు చేయకుండానే తమ అంతర్జాతీయ కెరీర్‌ను ముగించారు. కానీ, బ్రాడ్‌మన్, సెహ్వాగ్, గేల్, లారా మాత్రం తలా రెండుసార్లు ట్రిపుల్ సెంచరీలు చేయడంలో విజయం సాధించారు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బ్రాడ్‌మాన్ జాబితాలో బ్రియాన్ లారా పేరు కూడా చేరింది. ఆ తర్వాత భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తనను తాను ఈ గొప్ప క్లబ్‌లో చేర్చుకున్నాడు. ఆ తరువాత, క్రిస్ గేల్ కూడా రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించి, అత్యధిక సార్లు చేసిన బ్యాట్స్‌మెన్‌లో తనను తాను చేర్చుకున్నాడు.

అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ ఎవరు సాధించారంటే?

నిజానికి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. తుఫాన్ బ్యాటింగ్‌తో బౌలర్లలో భయం పుట్టించిన ఈ మాజీ ఓపెనర్.. 2008లో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి ఈ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్ 319 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ 278వ బంతికి సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ప్రపంచ రికార్డుకు 16 సంవత్సరాలు గడిచాయి. కానీ, ఇప్పటి వరకు ఎవరూ దానిని బద్దలు కొట్టలేకపోయారు.

ఇవి కూడా చదవండి

ఇందులో 42 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి..

319 పరుగుల ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఆడుకున్నాడు. ఫోర్లు, సిక్స్‌లతో చితక్కొట్టాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో 42 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. 304 బంతులు ఎదుర్కొన్న సెహ్వాగ్ 530 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. సెహ్వాగ్ రెండవ ట్రిపుల్ సెంచరీ పాకిస్థాన్‌పై అతను సాధించిన వేగవంతమైన ట్రిపుల్ సెంచరీల జాబితాలో నాల్గవదిగా మారింది. 2004లో ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో 309 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన సెహ్వాగ్.. 364 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.

ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్స్..

వీరేంద్ర సెహ్వాగ్ – 278 బంతులు

హ్యారీ బ్రూక్ – 310 బంతులు

మాథ్యూ హేడెన్ – 362 బంతుల్లో

వీరేంద్ర సెహ్వాగ్ – 364 బంతులు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..